Karnataka Election Result 2023 Live: కర్ణాటక కొత్త కేబినెట్ ఎలా ఉండనుందంటే

Karnataka Election Result 2023 Live Updates in Telugu: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగ్గా నేడు ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్‌లో జీ న్యూస్ అభిప్రాయపడినట్టుగానే కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ లభించింది. 1989 తరువాత భారీ మెజార్టీతో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.  

Written by - Pavan | Last Updated : May 13, 2023, 10:39 PM IST
Karnataka Election Result 2023 Live: కర్ణాటక కొత్త కేబినెట్ ఎలా ఉండనుందంటే
Live Blog

Karnataka Election Result 2023 Live Updates in Telugu: దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలంటే 113 సీట్లు అవసరం కాగా కాంగ్రెస్ పార్టీ అంతకంటే 22 స్థానాలు ఎక్కువే గెలుచుకోవడం విశేషం. బీజేపీకి 65 స్థానాలు, జేడీఎస్ పార్టీ 19 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. మరిన్ని లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లైవ్ బ్లాగ్ ఫాలో అవుతూ ఉండండి. 

13 May, 2023

  • 22:34 PM

    Basavaraj Bommai resigns as Karnataka CM : కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా

    Basavaraj Bommai resigned to his CM Post : కర్ణాటక ఎన్నికల్లో బీజేపి ఓటమి నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మై తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక రాజ్ భవన్‌లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్‌కి తన రాజీనామా లేఖ సమర్పించగా.. గవర్నర్ సీఎం రాజీనామాను ఆమోదించారు.

     

  • 22:09 PM

    Bandi Sanjay About Karnataka Results: కర్ణాటక ఎన్నికల్లో బీజేపి ఓటమిపై బండి సంజయ్ విశ్లేషణ  

    కర్ణాటక ఎన్నికల ఫలితాల సరళిని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తనదైన శైలిలో విశ్లేషించారు. కర్ణాటకలో బీజేపి ఓడిపోయినప్పటికీ.. అక్కడ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఏ మాత్రం తగ్గలేదన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ విజయానికి ఆ పార్టీ ఒక మతాన్ని ప్రోత్సహించడమే కారణం అని అన్నారు. అదేంటి ఓటు బ్యాంకు తగ్గకపోతే మరి బీజేపి ఎలా ఓటమి పాలైందని అనుకుంటున్నారా ? అయితే బండి సంజయ్ గణాంకాలు ఎలా ఉన్నాయో, ఎందుకు ఓటు బ్యాంకు తగ్గలేదని అంటున్నారో ఈ పూర్తి కథనం చదివితే మీకే అర్థం అవుతుంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపి ఓటమిపై బండి సంజయ్ విశ్లేషణ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 21:09 PM

    Karnataka New Cabinet 2023: కర్ణాటక కేబినెట్‌లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు

    Karnataka New Cabinet 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అనే సస్పెన్స్‌కి తెర వీడింది. ఇక మిగిలిందల్లా కర్ణాటకకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? కర్ణాటక కొత్త కేబినెట్‌ ఎలా ఉండబోతోంది అనేదే ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 20:29 PM

    AICC President Mallikharjuna Kharge: ప్రజా సమస్యలే ముఖ్యం.. అహంకారం కాదు.. : మల్లిఖార్జున ఖర్గే 
    అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే నడవదు.. ప్రజా సమస్యలే ముఖ్యం అని కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరోసారి స్పష్టంచేశాయని ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గె అభిప్రాయపడ్డారు.

  • 19:42 PM

    Harish Rao, KTR : కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    KTR, Harish Rao About Karnataka Election Result 2023: కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు తెలంగాణలో త్వరలోనే జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా కర్ణాటక ఫలితాలపై తెలంగాణ అధికార పార్టీ నేతలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు స్పందిస్తూ ఏమన్నారంటే.. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 18:22 PM

    Karnataka Election Result 2023:  మ్యాజిక్ నెంబర్ కంటే 22 స్థానాలు ఎక్కువే
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి 113 సీట్లు అవసరమైన మేజిక్ నెంబర్ కాగా.. సాయంత్రం 5 గంటల సమయానికే కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ దాటి మరో 22 స్థానాలు ఎక్కువ సంఖ్యే సొంతం చేసుకుంది. ఇంకా కొన్ని స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. 

  • 18:14 PM

    CM Bommai’s convoy gets stuck: కాంగ్రెస్ సంబరాలు.. నిలిచిపోయిన సీఎం బొమ్మై కాన్వాయ్
    కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటుండటంతో అదే సమయంలో అటుగా వచ్చిన కర్ణాటక సీఎం బొమ్మై కాన్వాయ్ ట్రాఫిక్ జామ్‌లో నిలిచిపోయింది.

  • 18:01 PM

    KC Venugopal: కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై కేసీ వేణు గోపాల్ కామెంట్

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం 2024 లోక్ సభ ఎన్నికలకు ఒక మైలురాయిగా నిలిచిపోతుంది - కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్

  • 17:49 PM

    Siddaramaiah's Majority: సిద్ధరామయ్య మెజార్టీ ఎంతంటే..
    వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య బీజేపి అభ్యర్థిపై 46 వేల మెజార్టీతో గెలుపొందారు. 

  • 17:42 PM

    Jairam Ramesh About Karnataka Election Result 2023: ప్రధాని మోదీని కర్ణాటక ప్రజలు తిరస్కరించారు.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
    కర్ణాటక ఎన్నికలను మేము కర్ణాటక అసెంబ్లీ కోసం జరుగుతున్న ఎన్నికలుగానే భావించాం. కానీ బీజేపి ఈ ఎన్నికలను కర్ణాటక కోసం కాకుండా ప్రధాని మోదీ కోసం జరుగుతున్న పోరుగా చూపించింది. ఇక్కడ సమస్య అంతా కర్ణాటక గురించే కానీ జాతీయ రాజకీయం కాదు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రధాని మోదీ ఆశీర్వాదాలు మీతో ఉండవు అని అన్నారు. అలాగే ప్రధాని మోదీ బెంగళూరులో రోడ్ షో నిర్వహించారు. కానీ కర్ణాటక ప్రజలు అవన్నింటినీ తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు అని కాంగ్రెస్ అగ్ర నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. 

     

  • 17:14 PM

    Karnataka Election Result 2023: కర్ణాటకలో గత ఎన్నికల్లో గెలవని బీజేపి.. మధ్యలో ఎలా అధికారం చేజిక్కించుకుందంటే
    కర్ణాటకలో గత ఎన్నికల్లో వాస్తవానికి కాంగ్రెస్, జేడీఎస్ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, కూటమిలో విబేధాల కారణంగా సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత 14 నెలలకు ఆ కూటమి అధికారాన్ని కోల్పోగా.. అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో బీజేపి నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొలుత బిఎస్ యెడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆ తరువాత బసవరాజ్ బొమ్మైకి దారినిస్తూ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.

  • 15:54 PM

    సీఎం రేసులో తాను లేనని దేవనహళ్లిలో గెలిచిన కేహెచ్ మునియప్ప అన్నారు. హైకమాండ్ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దేవనహళ్లిలో పదేళ్లుగా కాంగ్రెస్ గెలవలేదని.. ఈసారి ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తామన్నారు. 
     

  • 15:24 PM

    కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఏక చక్రాధిపత్యం కనబరుస్తోంది. మొత్తం 224 స్థానాల్లో ఇప్పటివరకు 131 స్థానాల్లో గెలుపొందింది. మరో 4 అసెంబ్లీ స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. ఏ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేని రీతితో కాంగ్రెస్ విజయం సాధించింది.

  • 15:12 PM

    కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని మంత్రి కేటీఆర్ అన్నారు. 'కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో.. అదేవిధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపవు. నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. హైదరాబాద్, బెంగళూరు పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆరోగ్యంగా పోటీ పడనివ్వండి. కర్ణాటకలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు..' అని ఆయన ట్వీట్ చేశారు.

     

  • 15:10 PM

    కన్నడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన రాహుల్ గాంధీ

    ప్రేమతో కన్నడ ప్రజల మనసులు గెలుచుకున్నాం.. 

    కర్ణాటక ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు

    పేదల కోసం కాంగ్రెస్ కొట్లాడింది

    ఇదే ఫలితాలు అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయి

    కర్ణాటకలో పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ జరిగింది

    ఇది మనందరి విజయం: రాహుల్ గాంధీ

  • 14:39 PM

     

    కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు

     

  • 14:28 PM

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. 113 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి.. మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసింది. మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
     

  • 14:20 PM

    మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప కామెంట్స్

     

  • 14:19 PM

    కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. సాయంత్రం తుది ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం రాత్రి రాజీనామా చేయనున్నారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయనుంది.

  • 14:14 PM

    సీఎం రేసులో సిద్దరామయ్య, డీకే శిమకుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం అభ్యర్థుల సర్వేలో సిద్దరామయ్యకు టాప్ ప్లేస్‌ దక్కింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కలిసే అవకాశం ఉంది. మరోవైపు కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డారు. ఎన్నికలకు ముందు ఈడీ దాడులు చేసినా.. ఆయన బెదరలేదు.

  • 13:36 PM

    ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్ ఆధిక్యంలో దోసుకుపోతుంది. మెజార్టీ మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

  • 13:20 PM

    సిద్ద రామయ్య కామెంట్స్

     

  • 13:04 PM

    కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎమోషనల్ అయిన డీకే శివకుమార్

     

  • 13:00 PM

    మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించారు. తన సొంత పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష నుంచి గంగావతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు.

  • 12:46 PM

    సిద్ద రామయ్య సీఎం అంటూ టాటూ వేయించుకున్న ఓ అభిమాని..
     

  • 12:42 PM

    మాజీ సీఎం కుమారస్వామి ఎన్నికల్లో విజయం సాధించగా.. ఆయన కుమారుడు నిఖిల్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. కాంగ్రెస్ పార్టీ 130 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 12:30 PM

    ==> బళ్లారి రూరల్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి బి.నాగేంద్ర గెలుపు 

    ==> బీజేపీ మంత్రిని శ్రీరాములును ఓడించిన బి.నాగేంద్ర

  • 12:28 PM

    కర్ణాటక ఎన్నికల్లో సంచలన ఫలితం వెల్లడైంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్‌ షెట్టర్ ఓడిపోయారు. మొదటి రౌండ్‌ నుంచి వెనుకంజలో ఉన్న ఆయన.. బీజేపీ అభ్యర్థి మహేష్‌ తెంగని చేతిలో ఓటమి పాలయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఎన్నికలకు ముందు కాంగెస్‌లో చేరి.. ఆ పార్టీ నుంచి పోటీ చేశారు.

  • 12:20 PM

    'మేము మార్క్ చేయలేకపోయాం. ఫలితాలు వచ్చిన తర్వాత వివరణాత్మక విశ్లేషణ చేస్తాం. జాతీయ పార్టీగా వివిధ స్థాయిల్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో విశ్లేషించుకుంటాం..' అని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.

     

  • 12:18 PM

    కర్ణాటకలో కాంగ్రెస్ సంబరాల్లో ఉండగా.. ఆ పార్టీ ముఖ్య నేత సిద్ధరామయ్య ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. ఆయన సోదరి శివమ్మ భర్త రామేగౌడ (69) కన్నమూశారు. శనివారం ఉదయం అస్వస్థతకు గురైన ఆయనను.. మైసూరు ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సిద్దరామయ్య గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
     

  • 12:15 PM

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్స్..

    ==> కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు

    ==> కర్ణాటకలో కాంగ్రెస్ వైపు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారు

    ==> శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలి

    ==> భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారు

    ==> శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించడు

    ==> కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీని.. జేడీఎస్‌ను ఓడించి కేసీఆర్‌ను తిరస్కారించారు

    ==> కర్ణాటక తీర్పును కాంగ్రెస్ సాదరంగా స్వాగతిస్తున్నాం..

    ==> దేశంలో ఇవే ఫలితాలు రాబోతున్నాయి.

    ==> తెలంగాణలోనూ స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

    ==> ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారు.
     

  • 12:06 PM

    తాజా ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. కాంగ్రెస్‌కు 42.93% ఓట్లు, బీజేపీకి 36.17% ఓట్లు లభించాయి. జేడీఎస్‌కు 12.97 శాతం ఓట్లు వచ్చాయి.
     

  • 12:03 PM

    ==> బీజేపీ తరపున బ్రహ్మానందం ప్రచారం చేసిన చిక్కబల్లాపూర్లో ఓటమి దిశగా బీజేపీ

    ==> కాంగ్రెస్ అభ్యర్థులను తరలించడానికి 15 హెలికాఫ్టర్లు సిద్ధం చేసిన కాంగ్రెస్

    ==> బళ్లారి రూరల్‌లో కాంగ్రెస్ హవా.. మంత్రి శ్రీరాములుపై గెలుపు బాటలో కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర.. 30 వేల పైచిలుకు అధిక్యతతో కొనసాగుతున్న నాగేంద్ర

  • 12:00 PM

    కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గంలో భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఆరో రౌండ్ తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థి యథాన్ యాసిర్ అహ్మద్ ఖాన్‌పై 21 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకు 59,242 ఓట్లు వచ్చాయి.

  • 11:58 AM

    ==> నిలోఫర్ వద్ద హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

    ==> కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు.

  • 11:56 AM

    మీడియాతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య

     

  • 11:53 AM

    కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ, జేడీఎస్‌ పార్టీలు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ 112, బీజేపీ 66, జేడీఎస్‌ 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అధికారం చేపట్టేందుకు 113 స్థానాలు కావాలి.
     

  • 11:51 AM

    కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగారు. మ్యాజిక్ మార్క్‌ దాటే అవకాశం ఉన్నా.. జేడీఎస్‌తో చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భేటీ కానున్నారు. జేడీఎస్‌తో బీజేపీ టచ్‌లోకి వెళ్లడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది.
     

  • 11:49 AM

    కర్ణాటక ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ విజయం సాధించారు. కనకపూరా అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గెలుపొందారు.
     

  • 11:43 AM

    Karnataka Election Result 2023 Live: కాంగ్రెస్ 118, బీజేపీ 73 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం చేపట్టేందుకు 113 సీట్లు అవసరం. కాంగ్రెస్ మ్యాజిక ఫిగర్‌ను దాటేసి స్పష్టమైన మెజార్టీలో ఉంది. జేడీఎస్‌ 25, కేఆర్‌పీపీ 1, ఎన్‌సీపీ 1, ఎస్‌కేపీ ఒక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

  • 11:38 AM

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఖాతా తెరిచాయి.

    ==> చల్లకెరె-రఘుమూర్తి (కాంగ్రెస్‌)
    ==> ఎల్లపౌర-శివరామ్‌ (బీజేపీ)
    ==> హసన్‌-స్వరూప్‌ (జేడీఎస్)

  • 11:22 AM

    వెనకంజలోనే జగదీశ్ షెట్టర్.. ఎన్ని ఓట్లంటే..
     

  • 11:20 AM

    బీజేపీపై ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తమకు ఎవరి మద్దతు అవసరం లేదన్నారు. కర్ణాటకలో మత రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు.

  • 11:17 AM

    బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను 40 నియోజకవర్గాలు బయపెడుతున్నాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఆధిక్యంలో వెయిలోపే ఉండడంతో గెలుపు ఎవరిదనే విషయం ఆసక్తికరంగా మారింది. 

  • 11:10 AM

    కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. బెంగుళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కుమారస్వామితో బీజేపీ అగ్రనేతలు భేటీ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు కొంచెం అటు ఇటు సీట్లు వచ్చినా.. జేడీఎస్‌తో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Trending News