ICSE Class 10 Board Exams Cancel: ద కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(CISCE) పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందడం, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీఎస్ఈ(ICSE) పదో తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని ఓ అధికారి ప్రకటనలో తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్షల‌ను మాత్రం వాయిదా వేశారు. ఈ బోర్డు పరీక్షలను కొన్ని రోజుల అనంతరం ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి ఐసీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ తేదీలను ఖరారు చేయలేదు. కరోనా పాజిటివ్(Coronavirus) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీన విడుదల చేసిన ఎగ్జామ్స్ సర్క్యూలర్‌ను ఉపసంహరించుకున్నామని ఓ ప్రకటనలో బోర్డు పేర్కొంది. విద్యార్థులు, టీచింగ్ ఫ్యాకల్టీ ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చి 10వ తరగతి పరీక్షలు రద్దు చేయగా, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు తాజా ప్రకటనలో వెల్లడించారు. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 12 త‌ర‌గ‌తి ప‌రీక్షలు మే 4 నుంచి జూన్ 14 వ‌ర‌కూ జ‌ర‌గాల్సి ఉంది.



11వ తరగతిలో ప్రవేశాలు
విద్యార్థుల 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో 11వ తరగతిలో ప్రవేశాలపై సైతం ఐసీఎస్ఈ ప్రకటన చేసింది. విద్యాసంస్థలు 11వ తరగతి అడ్మిషన్లు ప్రారంభించాలని సూచించింది. వారికి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఐఎస్‌సీ 2023 సిలబస్ బోధించాలని సైతం తాజా ప్రకటనలో తెలిపారు.


Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 20, 2021, ఓ రాశివారికి వాహనయోగం


కాగా, క‌రోనా రెండో దశలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ ప‌దో త‌ర‌గ‌తి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేశారు. అదే సమయంలో సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి బోర్డ్ ఎగ్జామ్స్‌ను ప్రస్తుతానికి వాయిదా వేశారు. త్వరలో వారి పరీక్షల షెడ్యూల్ సిద్ధం చేయనున్నామని విద్యాశాఖ పేర్కొంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook