Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 20, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Today Horoscope In Telugu 20 April 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 20వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందనే విషయాలు రాశిఫలాల ద్వారా తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2021, 08:08 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 20, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 20 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 20వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీరు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. సంతోషకర సమయంలో ఆరోగ్యం కోసం వ్యాయామం లాంటివి ప్రారంభించడానికి ఇది మంచి రోజు. మీ కృషి మీకు విజయాన్ని అందిస్తుంది. మీ తల్లిదండ్రుల నుండి కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. సోదరి, సోదరుడితో సమయాన్ని సరదాగా గడుపుతారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. వ్యాపారులకు ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయి.

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

వృషభ రాశి
మీ బలమైన సంకల్పం ఈ రోజు ఆఫీసులోని సమస్యలను అధిగమించడానికి సహాయం చేస్తుంది. అవసరంలేని వస్తువులకు డబ్బు ఖర్చు చేసే ముందు మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీ పిల్లల కోసం ఇంట్లో కొత్తగా నిర్మాణం చేపడతారు. కొన్ని రోజుల తరువాత నేడు మీ ప్రేమను తిరిగి పొందనున్నారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగులలో పనిలో ఆటంకాలు తొలగుతాయి.

మిథున రాశి
ఇటీవల నెలకొన్ని గజిబిజి పరిస్థితులు నేడు అదుపులోకి రానున్నాయి. మీ శక్తి సామర్థ్యాలను కొత్తగా పనిచేసే కార్యాలయంలో లేదా వ్యాపారంలో వినియోగిస్తే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపటం ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. విద్యార్థులు ఉన్నత చదువుల గురించి యోచిస్తారు. వ్యాపారులకు అంతగా కలిసిరాదు.   

కర్కాటక రాశి 
ఉదరానికి సంబంధించి మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం కోసం పండ్లు మరియు తాజా కూరగాయలు తినాలి. అదే సమయంలో మీరు పని కూడా చేయాల్సి ఉంటుందని మరిచిపోకూడదు. ఇంటి వద్ద నుంచి పని చేసే అవకాశాన్ని పొందుతారు. ఉద్యోగుల శ్రమను గుర్తించి ప్రమోషన్ అందుకునే అవకాశాలున్నాయి. చేతికి కొంత డబ్బు అందుతుంది.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

సింహ రాశి
ఈ రోజు వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారం మరో దశకు చేరుతుంది. అయితే బంధువులతో కలిసి వ్యాపారం చేయరాదని గుర్తుంచుకోండి. చేపట్టిన పనులలో జాప్యం తలెత్తుతుంది. ఉద్యోగులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికం కానున్నాయి. కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.

కన్య రాశి
ఇతర రోజుల కన్నా నేడు మీ పనిని ఎక్కువగా ఆస్వాదిస్తారు. మీ స్నేహితులు మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. మీ తండ్రి నుండి ఫోన్ ద్వారా కొన్ని శుభవార్తలను తెలుసుకుంటా. పని భారం అధికం కానుంది. తద్వారా కొన్ని శుభకార్యాలు, కార్యక్రమాలకు హాజరు కావడానికి వీలు కుదరదు. ఉద్యోగాలు మారేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

తులా రాశి
తులా రాశి వారు మీ ఉద్యోగంతో సంతృప్తి చెందుతారు మరియు మీరు ఒక చిన్న పనికి సంబంధించి యాత్రను కూడా ప్లాన్ చేయనున్నారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలు సైతం చేసుకోవాలని భావిస్తారు. పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఇంట్లో ముఖ్యమైన చర్చ జరుగుతుంది. తద్వారా మీ జీవిత భాగస్వామిలో కొంత సంఘర్షణను తలెత్తవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి.

Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ

వృశ్చిక రాశి
ఆఫీసులో నెలకొన్న పరిస్థితులు ఈ రోజు మిమ్మల్ని ఆగ్రహానికి గురి చేస్తాయి. కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. ఒత్తిడిని అధిగమించి పనిచేయగలరని నిరూపించడానికి ప్రశాంతంగా కూర్చుని పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు మంచిరోజు కాదు. అనవసర ఖర్చులకు డబ్బును వినియోగించవద్దు. విద్యార్థులు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడానికి కొంత సమయం కేటాయించండి.

ధనుస్సు రాశి
గతంలో చేసిన పెట్టుబడుల ప్రయోజనాలు నేడు పొందనున్నారు. కొంత నగదు చేతికి రానుంది. తద్వారా మీరు మరింత ఉత్సాహంగా పని ప్రారంభిస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఇంటి నిర్మాణం, లేదా పాతన ఇంటి పునరుద్ధరణపై కొంత సమయం ఆలోచిస్తారు. ఉద్యోగులకు సాధారణ ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ఆశించిన మేర ఫలితాలు పొందలేరు.

మకర రాశి
ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. అనారోగ్యం బారిన పడిగానా త్వరగా కోలుకుంటారు. గత కొంతకాలం నుంచి మీకు రావాల్సిన డబ్బు తిరిగి మీ చేతికి రానుంది. కొత్తగా పెళ్లయిన వారు తమ జీవిత భాగస్వామితో బంధం బలపడాలని కోరుకుంటారు. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికం కానుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు.

కుంభ రాశి
ఈ రోజు మీ కోసం ఇంట్లో ఒక ముఖ్యమైన రోజు కానుంది. మీరు పిల్లలు మరియు మీ జీవిత భాగస్వామితో బిజీగా గడపనున్నారు. విద్య మరియు ఉద్యోగాల పరంగా మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. మీరు ఏదైనా ఆభరణాలను కొనుగోలు చేస్తుంటే, శక్తికి మించి ఎక్కువ ఖర్చు చేయవద్దని గుర్తుంచుకోండి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. నేడు మీరు వాహనం కొనుగోలు చేయాలని భావిస్తారు.

మీన రాశి
మీరు ఈ రోజు చాలా అసహనానికి లోనవుతారు. ఇది మీ పనికి ఆటంకం కలిగిస్తుంది. విద్యార్థులు చదువుకునేటప్పుడు ఉత్సాహంగా ఉండకపోవచ్చు, అందుకు వారు కొంత విరామం తీసుకోవాలి. అనారోగ్య సమస్య బాధిస్తుంది. ఉద్యోగులకు పని సజావుగా సాగదు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News