కేంద్ర బడ్జెట్‌ను ఆర్ఎస్ఎస్ రూపొందించిందా ?
కేంద్ర బడ్జెట్‌ను ఆర్ఎస్ఎస్ రూపొందించిందా ?
బెంగళూరు: కేంద్రం నేడు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై అధికార పార్టీ నేతల నుంచి హర్షం వ్యక్తమవుతుండగా ఈ బడ్జెట్‌పై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ''కేంద్ర బడ్జెట్ స్వరూపాన్ని పరిశీలిస్తే, బడ్జెట్‌ను ఆర్థిక శాఖకు చెందిన అధికారులు రూపొందించారా లేక ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ్ స్వయం సేవక్) రూపొందించిందా తనకు అర్థం కావడం లేదు'' అని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ఎద్దేవా చేశారు.
కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం బడ్జెట్‌పై కుమారస్వామి స్పందిస్తూ.. ''తాను కర్ణాటకలో రైతులకు రుణమాఫి పథకాన్ని ప్రకటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. రైతులకు లాలీపాప్ వేశారని తనను ఎద్దేవా చేశారు. మరి ఇవాళ కేంద్రం రైతులకు చేసింది ఏంటి'' అని ప్రశ్నించారు. కచ్చితంగా ఈ బడ్జెట్‌ను బీజేపీకి సన్నిహితంగా మెదిలే వారే రూపొందించారు అంటూ ఆర్ఎస్ఎస్‌పై కుమారస్వామి పరోక్ష విమర్శలు చేశారు.