JEE Advanced Results 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఖరగ్‌పూర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను(JEE Advanced Results)ఖరగ్‌పూర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు jeeadv.ac.inలో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. రోల్ నెంబర్ లేదా వ్యక్తిగత వివరాలు నమోదు చేసి JEE Advanced Results 2021 చెక్ చేసుకోవచ్చు. ఐఐటీ ఖరగ్‌పూర్ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు ఆల్ ఇండియా టాపర్స్ వివరాల్ని కూడా వెల్లడించింది. ఐఐటీల్లో ప్రవేశం కోసం అక్టబర్ 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరిగింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఉత్తీర్ణులైన విద్యార్ధులు ఐఐటీ, ఐఐఎస్‌సి, ఐఐఎస్ఈఆర్ కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులుంటాయి.


ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు


JEE Advanced Results 2021 ఫలితాల్ని అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. ముందు రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి. తరువాత జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్ చేయాలి. ఆ తరువాత మీ ఫలితాలు స్క్రీన్‌పై కన్పిస్తాయి.


జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడైన నేపధ్యంలో రేపట్నించి కౌన్సిలింగ్ (IIT Counselling)ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 16 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దేశంలోని 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ జరగనుంది. ఈ నెల 22, 24 తేదీల్లో జోసా మాక్ కౌన్సిలింగ్ జరగనుంది. ఈ నెల 25 వరకూ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. 27వ తేదీన మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. నవంబర్ 1వ తేదీ రెండవ దశ సీట్ల కేటాయింపు, నవంబర్ 6న మూడవ దశ, 10వ తేదీన నాలుగవ దశ, 12వ తేదీన నాలుగవ దశ, 14 వ తేదీన ఐదవ దశ, 18వ తేదీన ఆరవ విడత కౌన్సిలింగ్ ప్రక్రియ జరగనుంది. మొత్తం ఆరు దశల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. చివరి దశలో సీటు పొందిన విద్యార్ధులు నవంబర్ 18 నాటికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 


Also read: CBSE Board Exams: సీబీఎస్ఈ పరీక్షలు ఆఫ్‌లైన్‌లోనే, పరీక్షల షెడ్యూల్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి