IIT Kharagpur: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థ. విద్యార్ధుల్లోని సృజనాత్మక ఇంజనీరింగ్‌ను వెలికి తీసే సంస్థ. ఐఐటీల్లో ప్రముఖమైన ఐఐటీ ఖరగ్‌పూర్ విభాగం ఇప్పుడు కొత్త ఘనత సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఉన్న టాప్ ఐఐటీల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి ఐఐటీ ముంబై, ఐఐటీ చెన్నై, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్  సంస్థలు. ఐఐటీ ఖరగ్‌పూర్ సంస్థ ఈసారి మరో ప్రత్యేకత సాధించింది. ఈ ఏడాది జరిగిన ప్లేస్‌మెంట్స్‌లో అత్యధిక ఆఫర్లను అందుకున్న ఘనత దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్ ఈ ఏడాది 11 వందలకు పైగా ప్లేస్‌మెంట్ ఆఫర్లను అందుకున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. 


కరోనా మహమ్మారి కొనసాగుతున్న సమయంలో కూడా దేశంలో అన్ని ఐఐటీల(IIT)కంటే భారీగా ప్లేస్‌మెంట్ ఆఫర్లు దక్కించుకున్నది తమ సంస్థేనని తెలిపింది. ఐఐటీ చరిత్రలోనే అత్యధిక ప్లేస్‌మెంట్ ఆఫర్లను అందుకున్న సంస్థ అని తెలిపింది. అది కూడా 35 అంతర్జాతీయ ఆఫర్లను అందుకున్నట్టు ఐఐటీ ఖరగ్‌పూర్(IIT Kharagpur)స్పష్టం చేసింది. ఏడాదికి 2-2.4 కోట్ల ప్యాకేజీలతో ఇద్దరు ప్రధాన రిక్రూటర్ కంపెనీలు భారీ ఆఫర్లు చేశాయని ప్రకటించింది. ఇప్పటి వరకూ కోటి రూపాయలు అత్యధిక ఆఫర్ అని..అటువంటివి 20కు పైగా ఆఫర్లు వచ్చినట్టు సంస్థ పేర్కొంది. ఈసారి క్యాంపస్ సెలెక్షన్ కంపెనీల్లో క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబెర్,ఇంటెల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హనీవెల్, శాంసంగ్, ఐబీఎం ఉన్నాయి. డిసెంబర్ 1 వ తేదీ నుంచి మూడ్రోజుల వరకూ క్యాంపస్ సెలెక్షన్స్ జరిగాయి. సాఫ్ట్‌వేర్, ఎనలిటిక్స్, కన్సల్టింగ్, కోర్ ఇంజనీరింగ్, బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో వందకు పైగా కంపెనీలు రిక్రూట్ మెంట్ లో పాల్గొన్నాయి.


Also read: Mohammed Siraj: లక్నో ఫ్రాంచైజీ చుట్టూ వివాదం, ఆఫర్ తిరస్కరించిన సిరాజ్‌పై ప్రశంసలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook