Mohammed Siraj: ఐపీఎల్ 2022 సీజన్ మెగా ఆక్షన్‌కు ముందే బేరసారాలు జరిగిపోతున్నాయి. కొత్తగా వస్తున్న లక్నో ఫ్రాంచైజీ వివాదాలకు తెరతీస్తుంటే..భారీ ఆఫర్ ఇచ్చినా తిరస్కరిస్తూ ప్రశంసలు కురిపించుకుంటున్నాడు ఆ బౌలర్.
ఐపీఎల్ 2022 సీజన్‌లో అతి ముఖ్యమైన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇప్పుడు జనవరి 2022లో జరిగే మెగా ఆక్షన్ కోసం వివిధ ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఈసారి కొత్తగా ఐపీఎల్‌లో తెరంగేట్రం చేస్తున్న లక్నో ఫ్రాంచైజీ వస్తూ వస్తూనే వివాదాలు రాజేస్తోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ లెవన్, ఎస్ఆర్‌హెచ్ జట్టకు ఆడిన కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లను ఆ జట్లు వదులుకోవడం, లక్నో ఫ్రాంచైజీ జట్టు ఈ ఇద్దరితో బేరసారాలు ఆడటం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై బీసీసీఐకు ఫిర్యాదు కూడా అందింది. బీసీసీఐ(BCCI) ఏం చర్య తీసుకుంటుందో చూడాలి.
ఇదే సమయంలో మరో ఐపీఎల్(IPL) ఆటగాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ సిరాజ్‌ను కూడా గాలం వేసేందుకు లక్నో ఫ్రాంచైజీ సిద్ధమైంది. పదికోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే మొహమ్మద్ సిరాజ్(Mohammed Siraj)మాత్రం తాను ఆర్‌సీబీకే ఆడేందుకు ఇష్టపడ్డాడు. మొహమ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ 7 కోట్లకు రిటైన్ చేసుకుంది. మొహమ్మద్ సిరాజ్..లక్నో ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించడంతో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. సిరాజ్ సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. డబ్బులకు ఆశపడకుండా ఆర్‌సీబీలో ఉండి సిరాజ్ మంచి పనిచేశాడంటున్నారు. ఇక ఇదే సమయంలో లక్నో ఫ్రాంచైజీ(Lucknow Franchisee) వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లీగ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ జట్టు వ్యవహరిస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి. 7 వేల కోట్లకు జట్టును దక్కించుకున్న గోయెంకా గ్రూపు..ఆటగాళ్లను ప్రలోభాలకు గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు.
Also read: BWF World Tour Finals 2021: సెమీఫైనల్లో యమగూచిని ఓడించి...ఫైనల్లో అడుగుపెట్టిన సింధు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook