IMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీ
IMD Heavy Rains Alert: నైరుతి రుతు పవనాలు దేశవ్యాప్తంగా విస్తరించేశాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో చురుగ్గా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ద్రోణి విస్తరించి ఉంది. ఫలితంగా దేశంలోని చాలా రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. ఏయే రాష్ట్రాల్లో ఎలా ఉండనుందో తెలుసుకుందాం.
IMD Heavy Rains Alert: నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది దేశంలో వారం రోజుల ముందే ప్రవేశించినా చురుగ్గా లేకపోవడంతో వర్షాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కానీ జూన్ చివరి వారం వచ్చేసరికి రుతు పవనాలు బలపడటంతో వర్షాలు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వివరించింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్, మరి కొన్నిరాష్ట్రాలకు ఎల్లో, రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
రానున్న 4-5 రోజుల్లో వాయువ్య, తూర్పు, ఈశాన్య భారతదేశంలో రుతు పవనాలు బలపడి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా బీహార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ రాష్ట్రాల్లో జూలై 2-6 వరకూ భారీ వర్షాలు పడనున్నాయి. ఇక జూలై 5,6 తేదీల్లో మాత్రం అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయల్లో అతి భారీ వర్ష సూచన ఉంది. గోవా, సెంట్రల్ మహారాష్ట్ర, గుజరాత్ సబ్ అర్బన్ ప్రాంతాలు, కర్ణాటక కోస్తా ప్రాంతంలో అతి భారీ వర్షాలు పడనున్నాయి.ఈ రాష్ట్రాలకు సైతం రెడ్ అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాల కారణంగా పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లోని నదీ పరివాహక ప్రాంతాలకు భారీగా వరదలు వచ్చే అవకాశముంది.
ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
ఇక అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సహా పది రాష్ట్రాలకు జూలై 3న ఆరెంజ్ అలర్ట్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. జూలై 4న ఉత్తరాఖండ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
ఎల్లో అలర్ట్ జారీ అయిన రాష్ట్రాలు
ఇకే జూలై 4వ తేదీన జమ్ము కశ్మీర్, లడఖ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈసారి వర్షాకాలంలో ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు తీవ్రమైన వరదలతో అల్లాడుతున్నాయి. అస్సోంలో పరిస్థితి చాలా విషమంగానే ఉందని తెలుస్తోంది. భారీ వర్షాలతో మిజోరాం, మణిపూర్ రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కొండ చరియలు భారీగా విరిగిపడుతున్నాయి.
దేశంలో ఈసారి జూన్ 11 నుంచి 27 వరకూ సాధారణం కంటే తక్కువే వర్షపాతం నమోదు కాగా ఆ తరువాత వర్షాలు పుంజుకున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి నైరుతి రుతుపవనాల ప్రభావం దేశంలో తగ్గుతుంది. మొత్తానికి ఈసారి భారీ వర్షాలు తప్పేట్టు లేదు.
Also read: Farmer Registry: పీఎం కిసాన్ నిధి వచ్చే వాయిదా కావాలంటే కిసాన్ రిజిస్ట్రీ తప్పదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook