ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ, చమోలీ, పితోరాఘడ్, దెహ్రాదూన్, పౌరీ, నైనితాల్ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో వరదల కారణంగా భారీ మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటికి దిగువకు వదులుతున్నారు. దీనికితోడు ఇంకా ఆగకుండా కురుస్తున్న వర్షాలు అక్కడి స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.