Income tax raids: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి. దాడుల్లో వేయి కోట్ల అక్రమాస్థులు లభించినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ వెల్లడించడం విశేషం. ఇంతకీ ఈ డబ్బు ఎవరిది..ఎన్నికలకు సంబంధముందా లేదా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamilnadu assembly elections) మరి కొద్దిరోజుల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో..రాష్ట్రం  వెలుపల ముఖ్యమైన ఎంపిక చేసిన నగరాల్లో ఇన్‌కంటాక్స్ అధికారులు దాడులు (Income tax raids) జరుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం జరిపిన దాడుల సంగతి మరువకముందే..మరోసారి సోదాలు జరిగాయి. బులియన్ ట్రేడర్, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జ్యువెల్లరీ రిటైలర్ పై ఈ దాడులు జరిగాయి. ఎవరిపై అనేది మాత్రం ఇన్‌కంటాక్స్ అధికారులు వెల్లడించలేదు. మార్చ్ 4 వ తేదీన ఏకకాలంలో చెన్నై, ముంబై, కోయంబత్తూర్, మధురై, తిరుచిరాపల్లి, త్రిసూర్, నెల్లూరు, జైపూర్, ఇండోర్‌లలో మొత్తం 27 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. 


ఈ దాడుల్లో వేయి కోట్ల అక్రమాస్థులు లభించినట్టు స్వయంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అధికారులు తెలిపారు. లెక్కచూపని నగదు మాత్రం 1.2 కోట్ల వరకూ ఉందని చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపధ్యంల ఐటీ దాడులు ( IT Raids) పెద్దమొత్తంలో జరగడం చర్చనీయాంశమైంది. ఎన్నికల ఎత్తుగడలో భాగమే ఈ దాడులనే విమర్శలు కూడా వస్తున్నాయి.


Also read: Taxpayers Alert: మార్చి 31వ తేదీలోగా ఈ పనులు మీరు పూర్తి చేయాలని మరువొద్దు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook