Corona Cases In India Today: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారి హెచ్చుతగ్గులు మినహా కరోనా కేసులు భారీగా తగ్గివచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,488 మంది​ వైరస్​ బారిన పడ్డారు. మరో 249 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఒక్క రోజులో 12,510 మంది కరోనాను జయించారు. కొత్త కేసులు భారత్​లో​ 538 రోజుల కనిష్ఠానికి కొవిడ్ చేరుకోగా.. యాక్టివ్​ కేసులు 534 రోజుల కనిష్ఠానికి దిగొచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవిడ్ పరీక్షలు..


భారత్​లో నవంబరు 21న 7,83,567 కొవిడ్​ టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 63,25,24,259కి చేరింది.


ప్రపంచవ్యాప్తంగా..


ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. కొత్తగా 3,86,897 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి 4,114 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,5,78,09,749కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 51,67,588కు పెరిగింది. 


Also Read: పెట్రోలింగ్ కు వెళ్లిన ఎస్సైను దారుణంగా నరికి చంపిన దొంగల ముఠా 


Also Read: రైతులకు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్- స్మార్ట్​ఫోన్ కొంటే 10 శాతం క్యాష్​ బ్యాక్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook