SI Murder In Trichy: పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఓ ఎస్సై దారుణ హత్యకు గురయ్యారు. మేకలను అక్రమంగా తరలిస్తున్న ఓ దొంగల ముఠాను ఆ ఎస్సై అడ్డుకోగా.. అతడ్ని దారుణంగా చంపారు. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చి జిల్లాలో జరిగింది. నావల్పట్టు పోలీసుస్టేషన్‌లో భూమినాథన్ (56) సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి ఆయన పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. నావల్పట్టు ప్రధాన రహదారిలో బైకులపై కొందరు మేకలను అనుమానాస్పదంగా తరలిస్తున్న విషయాన్ని ఆయన గుర్తించారు. దీంతో ఆ ముఠాను ఆపిన భూమినాథన్.. వారి గురించి ఆరా తీయడం ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మేకలను దొంగిలించే ముఠాగా వారిని గుర్తించారు. అయితే అక్కడ నుంచి వారు పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఎస్సై తన ద్విచక్ర వాహనంతో వారిని వెంబడించారు.
పారిపోయితున్న ముఠాను కలమావూరు రైల్వే గేట్ సమీపంలోని పల్లతుపట్టి గ్రామం వద్ద ఎస్సై అడ్డుకుని.. ముఠాలోని ఇద్దరు సభ్యులను పట్టుకున్నారు. అయితే తప్పించుకున్న మిగతా సభ్యులు తిరిగి వచ్చి భూమినాథన్‌తో గొడవకు దిగారు. వారిని విడిచిపెట్టాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ పోలీసు అధికారి నిరాకరించడం వల్ల రెచ్చిపోయిన వారు.. తమ వద్ద ఉన్న పదునైన ఆయుధాలతో ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాల పాలైన భూమినాథన్ అక్కడికక్కడే మృతి చెందారు. భూమి నాథన్ చనిపోయాడని భావించిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. ఉదయం 5 గంటలకు బాటసారులు.. ఎస్సై మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: రైతులకు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్- స్మార్ట్‌ఫోన్ కొంటే 10 శాతం క్యాష్ బ్యాక్!
Also Read: యూపీ: పెళ్లైన 9 నెలలకు..భార్య నల్లగా ఉందని తలాక్ చెప్పేశాడు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook