Monekypox Cases Updates: దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. 22 ఏళ్ల ఓ యువతికి శుక్రవారం (ఆగస్టు 12) మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ మహిళ ఢిల్లీలోని లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ (LNJP) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డా.సురేష్ కుమార్ వెల్లడించారు. తాజా కేసుతో ఢిల్లీలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 5కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంకీపాక్స్ సోకిన ఐదుగురిలో ఒకరు ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా మరో నలుగురిని ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు డా.కుమార్ తెలిపారు. తాజాగా మంకీపాక్స్‌ బారిన పడిన యువతి  నెల క్రితం విదేశాలకు వెళ్లి వచ్చిందని.. ఇటీవలి కాలంలో అయితే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదన్నారు.


ఢిల్లీలో జూలై 24న మొదటి మంకీపాక్స్ కేసు నమోదైంది. మంకీపాక్స్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ ప్రకటించిన మరుసటిరోజే ఢిల్లీలో మంకీపాక్స్ కేసు బయటపడింది. అంతకుముందు, జూలై 14న దేశంలోనే మొదటి మంకీపాక్స్ కేసు కేరళలోని కొల్లాం జిల్లాలో బయటపడింది. మంకీపాక్స్ ప్రాణాంతకం కానప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాలని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలకు సూచిస్తోంది.


మంకీపాక్స్ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సోకింది. 1958లో మొదట కోతుల్లో ఈ వ్యాధి బయటపడింది. ఆ తర్వాత 1970ల్లో మొదటిసారి మనుషుల్లో ఈ కేసు బయటపడింది. 2003లో తొలిసారి ఆఫ్రికా వెలుపల తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత పలు దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వ్యాధి ఇటీవలి కాలంలో వేగంగా మరిన్ని దేశాలకు విస్తరించింది.  ఈ వ్యాధి సోకినవారిలో జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కండరాల నొప్పి, అలసట లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి బారినపడి 10 మందిలో ఒకరికి మాత్రమే ఇది ప్రాణాంతంగా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.


Also Read: Munugode Trs: మునుగోడు టీఆర్ఎస్ లో ట్విస్ట్..  టికెట్ రేసులో కర్నె, కంచర్ల? అసమ్మతి స్వరంతో కూసుకుంట్ల అవుట్..


Also Read: Munugodu Byelection Live Updates: మునుగోడు పాదయాత్రకు రేవంత్ దూరం.. కేసీఆర్ తో కంచర్ల సోదరుల సమావేశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook