India Corona Update: దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన కేసులు ఇటీవలి కాలంలో స్వల్పంగా పెరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona pandemic) ఇండియాలో మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)..మళ్లీ సంక్రమిస్తోంది. దేశంలో అమలవుతున్న అన్‌లాక్ ప్రక్రియ కారణంగా కరోనా సంక్రమణ మరోసారి ఊపందుకుంది. గత కొద్దిరోజులుగా 40 వేలకు దిగువలో..35-38 వేల మధ్యలో నమోదవుతుండేవి. గత 24 గంటల్లో ఈ సంఖ్య పెరిగింది. కొత్తగా 43 వేల 654 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అటు 640 మంది కరోనా కారణంగా మరణించారు. 


దేశంలో ఇప్పటి వరకూ 4 లక్షల 22 వేల 22 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 41 వేల 678 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 3 కోట్ల 6 లక్షల 63 వేల 147 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 99 వేల 436 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 31.48 కోట్లమంది కరోనా మహమ్మారికి గురయ్యారు. దేశంలో ఇప్పటి వరకూ 44.61 కోట్లమందికి వ్యాక్సినేషన్ (Corona vaccination) పూర్తయింది.


Also read: Pegasus Spyware: పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జర్నలిస్టులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook