Corona Cases in India: దేశంలో కొవిడ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత మూడు రోజులుగా 12 వేలకు పైగానే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 12 వేల 899 మందికి వైరస్ సోకింది. కొవిడ్ భారీన పడిన మరో 15 మంది చనిపోయారు. దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 72 వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.62 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.17 శాతంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రికవరీలు తగ్గడం, కొత్త కేసులు పెరగడంతో క్రియాశీల కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో కొవిడ్ నుంచి 8 వేల 518 మంది కోలుకున్నారు. కరోనా పాజిటివిటీ రేటు ప్రమాదకరంగానే ఉంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడు, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌ లోనూ కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3వందల వరకు కొత్త కేసులు వస్తున్నాయి.  కొవిడ్ కేసులను బట్టి దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 



Read also: KTR MEET JUPALLI: అసంతృప్త నేతలకు తాయిలాలు.. బుజ్జగింపులు! టీఆర్ఎస్ లో కొత్త సీన్... కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా?


Read also: Rain Alert: తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook