India Covid: దేశంలో 40 శాతం పెరిగిన కరోనా కేసులు ..ఆ మూడు రాష్ట్రాల్లో జోరుగా..!
India Corona update: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 35,178 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 440 మంది మరణించారు.
India Corona update: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 35,178 పాజిటివ్ కేసులు(Corona positive Cases) నమోదయ్యాయి. మంగళవారం 25 వేలుగా నమోదైన కేసులు..ఒక్కసారిగా 40 శాతం మేర పెరిగి, 35 వేలకు చేరాయి. కరోనాతో కొత్తగా 400కి పైగా మరణించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది.
మంగళవారం 17,97,559 మందికి కొవిడ్ పరీక్షలు(Covid tests) నిర్వహించగా..35,178 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. భారత్(India)లో ఇప్పటివరకు 49 కోట్ల 84 లక్షల 27 వేల 083 టెస్టులు చేశారు. 24 గంటల వ్యవధిలో 440 మంది ప్రాణాలు విడిచారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 3.22 కోట్లకు చేరగా..ఇప్పటివరకు మహమ్మారికి బలైన వారి సంఖ్య 4,32,519కు పెరిగింది. మరణాల రేటు(Death Rate) 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.10 శాతంగా నమోదైంది.
Also Read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు
తాజాగా 37 వేల మంది కొవిడ్(Covid) నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.52 శాతానికి చేరగా.. క్రియాశీల కేసుల రేటు 1.14 శాతానికి తగ్గింది. ప్రస్తుతం 3,67,415 యాక్టివ్ కేసులు(Active Cases) ఉన్నాయి. మొత్తంగా వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.14 కోట్లకు చేరింది. దేశంలోనే ఎక్కువగా కేరళ(Kerala)లో 21.6వేల కొత్త కేసులు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్ర(Maharastra)లో 4.4వేలు, తమిళనాడు(Tamilnadu)లో 1.8వేల కొత్త కేసులు వచ్చాయి. నిన్న దేశంలోనే అత్యధికంగా కేరళలో 127 మంది చనిపోగా... మహారాష్ట్రలో 116 మంది, ఒడిశా(Odisha)లో 68 మంది చనిపోయారు.
56 కోట్ల టీకా డోసుల పంపిణీ..
జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా(Covid Vaccine) కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటివరకు 56 కోట్ల 06 లక్షల 52 వేల 030 వ్యాక్సిన్లు వేశారు. మంగళవారం ఒక్కరోజే 55,05,075 మంది టీకా వేయించుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook