India corona Update: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,603 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. మొత్తం 12,52,596 శాంపిళ్లను టెస్టు చేయగా ఈ కేసులు బయపడ్డట్లు తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే సమయంలో కొవిడ్ కారణంగా మరో 415 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. క్రితం రోజుతో పోలిస్తే మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 8,190 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.


మరిన్ని వివరాలు..


దేశవ్యాప్తంగా ప్రస్తుతం 99,974 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.29 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,70,530 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.36 శాతంగా ఉంది.


ఇప్పటి వరకు దేశంలో 3,46,24,360 మందికి కరోనా సోకగా.. అందులో 3,40,53,856 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది.


వ్యాక్సినేషన్ ఇలా..


నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 73,63,706 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,26,53,44,975 వద్దకు చేరింది.


ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అదుపులో ఉన్నా.. కొత్త వేరియంట్ భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణుకుల్లో కరోనా కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళనలు కలిగిస్తున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..


ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 265,197,799 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,258,365 మంది మహమ్మారికి బలయ్యారు. 238,491,434 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 20,961,152 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.


అమెరికాలో నిన్న ఒక్క రోజే 1.47 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. యూకేలో 50 వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. జర్మనీలో 70,681, ఫ్రాన్స్​లో 49,858 కేసులు బయటపడ్డాయి.


Also read: Omicron scare: 'వ్యాక్సిన్ వేసుకోకుంటే.. రేషన్ షాప్​ల నుంచి మాల్స్​ వరకు నో ఎంట్రీ'!


Also read: Kanpur Professor kills his family: ఒమిక్రాన్ భయంతో భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేసిన ప్రొఫెసర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook