Omicron scare: 'వ్యాక్సిన్ వేసుకోకుంటే.. రేషన్ షాప్​ల నుంచి మాల్స్​ వరకు నో ఎంట్రీ'!

Omicron scare: కరోనా కొత్త వేరియంట్ భయాలు దేశాన్ని వెంటాడుతున్న వేళ రాష్ట్రాలు కఠిన కొవిడ్ నిబంధనలను విధిస్తున్నాయి. తమిళనాడులోని ఓ జిల్లాలో వ్యాక్సిన్ వేసుకోని వారిని కేషన్​ షాప్​లు, మాల్స్​లోకి రాకుండా నిషేధం విధించేందుకు సిద్ధమైంది యంత్రాంగం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 12:55 PM IST
  • మధురైలో కఠిన కొవిడ్ నిబంధనలు
  • వారంలోపు అర్హులంతా ఒక డోసు వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే!
  • జిల్లా కలెక్టర్ ఆదేశాలు
Omicron scare: 'వ్యాక్సిన్ వేసుకోకుంటే.. రేషన్ షాప్​ల నుంచి మాల్స్​ వరకు నో ఎంట్రీ'!

Omicron scare in India: దేశంలో ఒమిక్రాన్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని మధురై జిల్లా కలెక్టర్ (COVID rules in Madurai)​.. ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

జిల్లాలోని అర్హులైన వారంతా కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేసుకుని ఉండాలని స్పష్టం (Vaccination mandatory in Madurai) చేశారు. ఇందుకు ఒక వారం మాత్రమే గడువు ఇచ్చారు. గడువు తర్వాత ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోని వారు బయటకు రావడం నిషేధమని స్పష్టం (Unvaccinated people banned from entering public) చేశారు. 

వ్యాక్సిన్ వేసుకోని వారిని రేషన్ షాప్​లు మొదలుకుని..  మాల్స్​, సహా ఇతర వాణిజ్య సముదాయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

కఠిన ఆంక్షలు ఎందుకు?

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నాయి. మన దేశంలోనూ ఇప్పటికే ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైందని అంచనాలు వస్తున్నాయి.

ప్రజలకు ఈ వేరియంట్ సోకకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎయిర్​పోర్ట్​లలోనే ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు.

అయినప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే మాస్క్ తప్పనిసరి, వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి వంటి నిబంధనలను విధిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మాస్క్ లేకుండా బయటకు వచ్చే వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నట్లు

ప్రకటించింది. అర్హులు అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కూడా సూచించింది. మరిన్ని రాష్ట్రాలు కూడా ఆంక్షలు కఠిన తరం చేస్తున్నాయి.

Also read: Kanpur Professor kills his family: ఒమిక్రాన్ భయంతో భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేసిన ప్రొఫెసర్

Also read: Cyclone Jawad: దూసుకొస్తున్న జవాద్​ తుపాను- విశాఖ, శ్రీకాకులంలో అతి భారీ వర్షాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News