India COVID-19 Cases: ఇండియాలో గత రెండు నెలలు తరువాత కరోనా పాజిటివ్ కేసులు లక్ష దిగువన నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫూలు విధించడంతో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది. వరుసగా రెండోరోజు లక్ష దిగువన కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా, నిన్నటితో పోల్చితే కరోనా కేసులు పెరిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 92,596 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపితే ఇప్పటివరకూ దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,90,89,069 (2 కోట్ల 90 లక్షల 89 వేల 69)కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే కరోనా మరణాల సంఖ్య సైతం పెరిగింది. తాజాగా 2,219 మంది కోవిడ్-19తో చనిపోయారు. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 3,53,528 మంది కరోనా బారిన పడి మరణించారు.


Also Read: Corona Third Wave: చిన్నారులపై కరోనా థర్డ్‌వేవ్..ఆధారాల్లేవంటున్న నీతి ఆయోగ్


జూన్ 8న ఒక్కరోజు దేశవ్యాప్తంగా 19 లక్షల 85 వేల 967 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. గత ఏడాది నుంచి మంగళవారం వరకు మొత్తం 37,01,93,563 (37 కోట్ల 1 లక్షా 93 వేల 563) శాంపిల్స్‌కు కోవిడ్-19 (Doctors Died During second wave of COVID-19) నిర్ధారణ పరీక్షలు పూర్తయినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. Corona Third Wave చిన్నారులపై ప్రభావం చూపుతుందనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.


Also Read: Galaxy S21 Mobiles: రూ.10,000 Cashback ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Samsung


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook