కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారితో తీవ్ర పోరాటం చేస్తున్న దేశాలలో భారత్ ఒకటి. దేశంలో ప్రతిరోజూ దాదాపు 10 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో 9,987 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 331 మంది కరోనా కాటుకు బలయ్యారు. భారత్‌లో ఒకరోజు సంభవించిన మరణాలలో (COVID19 Deaths India) ఇదే అత్యధికం. పోర్న్‌స్టార్‌గా మారిన నెంబర్ వన్ రేసర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయానికి కరోనా కేసుల సంఖ్య 2,66,598కి చేరింది. భారత్‌లో ఇప్పటివరకూ 7,466 కరోనా మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కేసులలో 1,29,215 మంది ప్రాణాంతక కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ కాగా, దేశంలో ప్రస్తుతం 1,29,917 యాక్టీవ్ కేసులున్నాయి.  బాలీవుడ్ నటి టాప్ 10 Bikini Photos


మే నెలలో లాక్‌డౌన్ (LockDown) నియమాలు సడలించిన తర్వాత నుంచి కరోనా పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. వైద్యులు, అధికారులు సూచించిన జాగ్రత్తలు పాటించకపోవడం, అనవసరంగా బయట తిరగడం లాంటివి కరోనా వ్యాప్తికి మరో కారణంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలలో కరోనా కేసులలో భారత్ 5వ స్థానంలో ఉండగా, కరోనా మరణాలలో 12వ స్థానంలో ఉంది. భారత్‌లో కరోనా ప్రభావం ఇప్పుడే మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్