Omicron Variant: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఊహించినట్టుగానే భయపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రరూపం దాలుస్తోంది. ఒమిక్రాన్ వెలుగుచూసిన దేశాల సంఖ్య వందకు చేరువలో ఉంది. అటు యూకేలో మాత్రం కరోనా మహమ్మారి కేసులు, ఒమిక్రాన్ కేసులు తీవ్రంగా ఉన్నాయి. రోజురోజుకూ యూకేలో పరిస్థితి విషమంగా మారుతోంది. యూకేలో రోజుకు 80-90 వేల కేసులు నమోదవుతూ పరిస్థితి దయనీయంగా మారుతోంది. అందుకే క్రిస్మస్ అనంతరం రెండువారాల లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 


ఇటు ఇండియాలో కూడా ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant)చాపకిందనీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో తాజాగా 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అటు తెలంగాణలో ఒక్కరోజులోనే 12 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇక కర్ణాటకలో కొత్తగా 4కేసులు, కేరళలో 4 కేసులు నమోదయ్యాయి. ఊహించినట్టుగానే డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా ఈ వేరియంట్ సంక్రమిస్తోంది. ప్రపంచంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 2.4 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా(South Africa)నుంచి వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్..ఇప్పుడు ఇండియాలో విరుచుకుపడనుందనే హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఇప్పుడు 123 కు చేరుకుంది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటం కలవరం రేపుతోంది. 


Also read: DRDO Agni P: 'అగ్ని-పి' క్షిపణి ప్రయోగం విజయవంతం: డీఆర్​డీఓ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook