Election Survey: దేశంలో సాధారణ ఎన్నికలకు ఇంకా సమయమున్నా..ముందస్తు ఎన్నికల విషయంపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఎన్నికలొస్తే అధికారం ఎవరిదనే విషయంపై జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు ఇంకా చాలా సమయం మిగిలుంది. 2024లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ముందస్తు ఎన్నికలపై చర్చ నడుస్తుండటంతో ప్రముఖ ఏజెన్సీలు జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ప్రముఖ సర్వే సంస్థ సీ ఓటర్- ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించింది. 


దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలో వస్తుందని..వరుసగా మూడవసారి ప్రదానిగా నరేంద్ర మోదీ (Narendra modi) ఎన్నిక కానున్నారని సీ ఓటర్ - ఇండియా టుడే సర్వే వెల్లడించింది. అయితే ఈ సర్వే ప్రకారం ఎన్డీయే అధికారంలో వచ్చినా..సీట్ల సంఖ్య మాత్రం 350 నుంచి 296కు పడిపోనుందని సర్వే తేల్చింది. బీజేపీ ఎంపీల సంఖ్య 303 నుంచి 271కు పడిపోనుందట.


అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కే (Ysr Congress) అనుకూలంగా ఉంది. ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమంటోంది సీ ఓటర్- ఇండియా టుడే సర్వే (C Voter- India Today Survey). పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు (Ys Jagan) ఉన్న ప్రజాదరణ అణుమాత్రం తగ్గలేదని స్పష్టమైంది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒక్కసీటు కూడా రాదని కూడా సర్వే స్పష్టం చేసింది. సీనియర్ జర్నలిస్టులు రాహుల్ కన్వల్, రాజ్ చెంగప్పల విశ్లేషణ ప్రకారం..ప్రజాదరణలో వైఎస్ జగన్‌కు తిరుగులేదని తెలుస్తోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రధాన కారణమని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల అంశంపై వ్యతిరేకత సర్వేలో కన్పించలేదని సమాచారం. 


Also read: Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్‌తో తీవ్రత తక్కువే, కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook