Lal Bahadur Shastri Car: నీతి, నిజాయితీకు నిలువెత్తు నిదర్శనం. దేశ అత్యున్నత పదవి అధిరోహించినా మారని వైఖరి. ఆ స్థానంలో ఉన్నా..కారు కోసం బ్యాంకు రుణం తీసుకున్నారు. చివరికి పెన్షన్ డబ్బులతో కారు ఈఎంఐ చెల్లింపులు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రెండవ ప్రధానిగా పని చేసిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri). నీతి, నిజాయితీకు చిరునామాగా నిలిచారు. నిఖార్సైన మనిషి. రాజకీయాల్లో అసలు మచ్చే లేని వ్యక్తి. దేశానికి ప్రధానిగా ఉన్నా సరే సొంత కారు లేకపోవడం విశేషం. చివరికి కారు కోసం బ్యాంకు నుంచి అప్పట్లో 5 వేల రూపాయలు అప్పు తీసుకుని ఫియట్ కారు కొనుగోలు చేశారు. దేశ ప్రధానిగా ఉంటూ లోనుతో కారు కొనుగోలు చేసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి...ఆ కారుని పూర్తిగా ఎంజాయ్ కూడా చేయలేకపోయారు. కారు కొనుగోలు తరువాత రష్యా పర్యటనకు వెళ్లారు. అక్కడ తాష్కెంట్‌లో ఉండగా అకాల మరణం చెందారు. ఆయన మరణంతో భార్యకు పెన్షన్ వచ్చేది. చివరికి ఆ పెన్షన్ డబ్బులతోనే లాల్ బహదూర్ శాస్త్రి భార్య ఫియట్ కారు కోసం తీసుకున్న 5 వేల రూపాయల రుణం(Car Loan) ఈఎంఐలను క్లియర్ చేసేశారు.



 


సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగినా ఎటువంటి అవినీతి మరకలు గానీ, ఆరోపణలు గానీ ఎదుర్కోని ఏకైన నేతగా లాల్ బహదూర్ శాస్త్రిని చెప్పుకోవచ్చు. ప్రధాని పదవికి ముందే కేంద్ర మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు. జనగామ వద్ద రైలు ప్రమాదం జరిగితే రైల్వేమంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలు ఇద్దరూ అక్టోబర్ 2నే జన్మించడం విశేషం.


Also read: India Vaccination: దేశంలో 90 కోట్ల మార్క్ దాటిన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి