India Vaccination: దేశంలో 90 కోట్ల మార్క్ దాటిన కోవిడ్ వ్యాక్సినేషన్

India Vaccination:ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ సరికొత్త మైలురాయిని దాటింది. దశలవారీగా ప్రారంభమైన ఇండియా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పుడు టార్గెట్‌కు చేరువలో ఉంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 3, 2021, 06:08 AM IST
  • దేశంలో వేగవంతమైన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
  • దేశవ్యాప్తంగా 90 కోట్లమందికి పైగా వ్యాక్సినేషన్
  • ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మార్క్‌కు చేరువలో కరోనా మరణాల సంఖ్య
India Vaccination: దేశంలో 90 కోట్ల మార్క్ దాటిన కోవిడ్ వ్యాక్సినేషన్

India Vaccination:ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ సరికొత్త మైలురాయిని దాటింది. దశలవారీగా ప్రారంభమైన ఇండియా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పుడు టార్గెట్‌కు చేరువలో ఉంది.

కరోనా మహమ్మారి(Corona Pandemic)నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ గత కొద్దిరోజులుగా వేగవంతమైంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 90 కోట్ల మైలురాయి దాటింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ముందు ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన ప్రభుత్వం మార్చ్ 1వ తేదీ నుంచి అందరికీ వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియ ప్రారంభమైంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది. మధ్యలో స్పెషల్ వ్యాక్సినేషన్ (Corona vaccination)డ్రైవ్‌లతో రోజుకు 2.50 కోట్ల వ్యాక్సిన్లను ఇచ్చిన పరిస్థితి ఉంది. వ్యాక్సినేషన్ ప్రారంభమై ఇవాళ్టికి 260 రోజులు. ఇప్పటి వరకూ 90 కోట్లకు పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. 

దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 197 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 24 వేల 354 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్ల 37 లక్షల 91 వేల 61కు చేరుకుంది. అటు కరోనా యాక్టివ్ కేసులు 2 లక్షల 73 వేల 889కు చేరుకుంది. 197 రోజుల తరువాత ఇదే అత్యల్పం. గత 24 గంటల్లో 234 మంది కోవిడ్ కారణంగా మరణించారు. దేశవ్యాప్తంగా 4 లక్షల 48 వేల 573 మంది కోవిడ్ కారణంగా మరణించారు. రికవరీ రేటు కూడా అత్యధికంగా 97.86 శాతంగా ఉంది. అటు అమెరికాలో అత్యధికంగా 7 లక్షల మంది కరోనా కారణంగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటి వరకూ 50 లక్షలమంది మరణించారు. అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్(Delta Variant)187 దేశాల్లో ఉన్నట్టు గుర్తించారు. 

గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8 వేలమంది కరోనా వైరస్(Coronavirus)కారణంగా మరణించారు. అంటే ప్రతి 5 నిమిషాలకు ఒకరు కరోనాతో మరణిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ శాతం అమెరికా, రష్యా, బ్రెజిల్, మెక్సికో, ఇండియాల్లో ఉన్నాయి. అమెరికాలో ఇప్పటి వరకూ 56 శాతం మందికి కరోనా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. అటు రష్యాలో గత 24 గంటల్లో 887 మంది కరోనా కారణంగా మరణించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇండియాలో రోజుకు 4 వేలమంది కరోనా కారణంగా మరణించారు. వ్యాక్సినేషన్ (India Vaccination)ప్రక్రియ వేగవంతమైన తరువాత ఈ సంఖ్య రోజుకు 3 వందలకు తగ్గడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా మరణాల రేటు, సంక్రమణ రేటు తగ్గుతోంది.

Also read:  ATM Business: SBI బ్యాంకుతో బిజినెస్.. ప్రతి నెల రూ. 60 వేలు సంపాదించే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News