Padma Awards Announcement: ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మక అవార్డుల్ని ప్రకటించింది. ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అరుదైన గౌరవం లభించింది. పద్మవిభూషణ్ అవార్డు వరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వివిధ రంగాల్లో దిగ్గజులు, సేవా ప్రవీణులకు ఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక అవార్డుల్ని భారత ప్రభుత్వం ( Indian Government ) ప్రకటించింది. రిపబ్లిక్ డే  ( Republic Day ) వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ( Central Government ) అవార్డులు జాబితా వెలువరించింది. మొత్తం 119  పద్మ అవార్డుల్ని ( Padma Awards ) ప్రకటించగా..అందులో 102 పద్మశ్రీ అవార్డులు కాగా..10 పద్మ భూషణ్ అవార్డులున్నాయి. మరో ఏడుగురికి పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చింది. ప్రముఖ గాయకుడు, తెలుగు, తమిళ, హిందీ వంటి విభిన్న భాషల్లో కీర్తి సాధించిన దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( Sp Bala Subrahmanyam ) కు పద్మవిభూషణ్ అవార్డు ( Padma Vibhushan ) ప్రకటించింది కేంద్రం. 


మరో తెలుగు సినీ గాయని చిత్ర ( Singer Chitra ) కు పద్మభూషణ్ అవార్డు ( Padma Bhushan Award ) దక్కగా..ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ట్స్ విభాగంలో రామస్వామి అన్నవరపు, నిడుమోలు సుమతి..సాహిత్యం, విద్యలో ప్రకాశరావు ఆశావాది, తెలంగాణ నుంచి ఆర్ట్స్ విభాగంలో కనకరాజుకు పద్మశ్రీ అవార్డులు ( Padma sri award ) దక్కాయి. ఎస్పీ బాలుతో పాటు మరణానంతర అవార్డులు అస్సోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ( Ramvilas paswan )లకు  అవార్డులు లభించాయి. విదేశాల్నించి జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు పద్మవిభూషణ్ దక్కింది. లడాఖ్ సరిహద్దుల్లో చైనా సైనికులతో ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహావీరచక్ర పురస్కారాన్ని అందించారు. 


Also read: Fact Check: వంద రూపాయల పాతనోట్ల రద్దుపై ఆర్బీఐ ఏం చెప్పిందంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook