Coronavirus Infection: చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలా ప్రమాదకరమైన కరోనా బీఎఫ్.7 కొత్త వేరియంట్ కేసులు భారీస్థాయి నమోదవుతుండడంతో మరోసారి ముప్పు తప్పదమోనని నిపుణుల హెచ్చరిస్తున్నారు. చైనాతో పాటు, యూఎస్‌ఏ, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పుడు మన దేశంలోనూ ప్రవేశించింది. కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు నమోదుకావడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) కోవిడ్ పాత నిబంధనలను మళ్లీ అనుసరించాలని ప్రజలను కోరింది. ఈ సందర్భంగా కీలక సూచన చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఐఎంఎ సూచించింది. సామాజిక దూరాన్ని పాటించాలని, బయటి నుంచి వచ్చిన తర్వాత సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పింది. ఇతర కోవిడ్ ప్రోటోకాల్‌లను పాటించాలని పేర్కొంది. ఇలా చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చని చెప్పింది. ర్యాలీలు, వివాహాలు, ఇతర సామాజిక సమావేశాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ మార్గదర్శకాలను అనుసరించాలని విజ్ఞప్తి చేసింది.


ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి


ఎవరికైనా జ్వరం, గొంతునొప్పి, దగ్గు, విరేచనాలు, లూజ్ మోషన్ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోరింది. ప్రస్తుతం మన దేశంలో ఆందోళన కలిగించే పరిస్థితి లేకున్నా జాగ్రత్తలు అవసరమని వైద్యులు చెబుతన్నారు. కాలం మారుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత విమానాశ్రయాలకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులలో 2 శాతం మందిని ర్యాండమ్‌గా పరీక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంటుకు తెలిపారు. 


Also Read: LPG Gas Cylinder Price: న్యూఇయర్‌లో గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గే అవకాశం..!  


Also Read:  MLAs Salary Statewise: రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యే జీతాల వివరాలు.. తెలంగాణ, ఏపీకి తేడా ఎంతంటే..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook