MLAs Salary Statewise: రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యే జీతాల వివరాలు.. తెలంగాణ, ఏపీకి తేడా ఎంతంటే..?

MLAs Salary In India: మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీతం ఒక్కో విధంగా ఉంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు జీతాలతో పాటు అనేక ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాయి. తెలంగాణ ఎమ్మెల్యే దేశంలో అందరి కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు జీతం ఎంతో తెలుసా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 03:34 PM IST
MLAs Salary Statewise: రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యే జీతాల వివరాలు.. తెలంగాణ, ఏపీకి తేడా ఎంతంటే..?

MLAs Salary In India: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ శాసనసభ సభ్యుడు ఉంటారు. ఎమ్మెల్యేను ప్రజలను ఎన్నుకుని శాసనసభకు పంపిస్తారు. అసెంబ్లీలో తన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. ఆ ప్రాంత సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను దగ్గర ఉండి పరిష్కరిస్తారు. తన నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారు. ఈ పనులన్ని చేసినందుకు ఎమ్మెల్యేకు జీతం ఇస్తుంది. ప్రతి నెల జీతంతోపాటు ప్రత్యేక అలవెన్సులు కూడా అందజేస్తుంది. దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అత్యధిక జీతం తీసుకుంటున్నారు.

వీరికి ప్రతి నెల జీతం రూ.2.50 లక్షలు అందుతోంది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర ఎమ్మెల్యేలు అతి తక్కువ జీతం పొందుతారు. ఎమ్మెల్యేల జీతం రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. తెలంగాణ తర్వాత అత్యధిక జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు మహారాష్ట్ర, ఢిల్లీకి చెందినవారు. మహారాష్ట్రలో రూ.2.32 లక్షలు, ఢిల్లీలో రూ.2.10 లక్షలు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇస్తోంది. అదే సమయంలో ఈ జాబితాలో యూపీ నాలుగో స్థానంలో ఉంది. యూపీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.1.87 లక్షలు, జమ్మూకశ్మీర్ ఎమ్మెల్యేలు నెలకు రూ.1.60 లక్షలు జీతం పొందుతున్నారు.  

ఈ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు అతి తక్కువ జీతం..

త్రిపుర ఎమ్మెల్యేల జీతం కంటే తెలంగాణ ఎమ్మెల్యేల జీతం 7 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఎమ్మెల్యేల వేతనాల విషయంలో ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాల కంటే వెనుకబడి ఉన్నాయి. త్రిపురతో పాటు నాగాలాండ్‌లో రూ.36 వేలు, మణిపూర్‌లో రూ.37 వేలు, అస్సాంలో రూ.42 వేలు, మిజోరంలో రూ.47 వేలు, అరుణాచల్‌ప్రదేశ్‌లో రూ.49 వేలు ఎమ్మెల్యేలు అందుకుంటున్నారు. జీతంతో పాటు వారు ఉండడానికి ప్రభుత్వం వసతి కల్పిస్తుంది. వైద్య, ప్రయాణ భత్యం కూడా పొందుతారు. దీంతో పాటు ఎమ్మెల్యే పదవి నుంచి దిగిపోయిన తరువాత ప్రతినెలా పింఛన్ కూడా ఇస్తున్నారు.

వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాల వివరాలు ఇలా.. 

రాష్ట్రం        శాసనసభ్యుల జీతం (రూ.లలో)

తెలంగాణ              2.50 లక్షలు
మహారాష్ట్ర             2.32 లక్షలు
ఢిల్లీ                        2.10 లక్షలు
ఉత్తర ప్రదేశ్         1.87 లక్షలు
జమ్మూ కాశ్మీర్       1.60 లక్షలు
ఉత్తరాఖండ్         1.60 లక్షలు
ఆంధ్ర ప్రదేశ్         1.30 లక్షలు
హిమాచల్ ప్రదేశ్   1.25 లక్షలు
రాజస్థాన్                1.25 లక్షలు
గోవా                        1.17 లక్షలు
హర్యానా                1.15 లక్షలు
పంజాబ్                 1.14 లక్షలు
పశ్చిమ బెంగాల్    1.13 లక్షలు
జార్ఖండ్                  1.11 లక్షలు
మధ్యప్రదేశ్           1.10 లక్షలు
ఛత్తీస్‌గఢ్                1.10 లక్షలు
తమిళనాడు            1.05 లక్షలు
కర్ణాటక                     98 వేలు
సిక్కిం                      86.5 వేలు
కేరళ                        70 వేలు
గుజరాత్                  65 వేలు
ఒడిషా                      62 వేలు
మేఘాలయ              59 వేలు
పుదుచ్చేరి                50 వేలు
అరుణాచల్ ప్రదేశ్  49 వేలు
మిజోరం                    47 వేలు
అస్సాం                     42 వేలు
మణిపూర్                  37 వేలు
నాగాలాండ్               36 వేలు
త్రిపుర                       34 వేలు

Also Read: Pawan Kalyan: ఆ పని విచిత్రంగా ఉంది.. ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్  

Also Read: Nayanthara : అందుకే ప్రమోషన్లకు రావడం లేదు.. నోరు విప్పిన నయనతార.. నయన్ బాధ అదేనా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News