IMD: చల్లని సమాచారాన్ని పంపిన వాతావరణ శాఖ..
దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆశగా ఎదురుచూసే నైఋతు ఋతుపవనాలు జూన్ 1న కేరళ రాష్ట్రంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ చల్లని కబురు తెలిపింది. కాగా భారత్ లో అత్యధిక శాతం వర్షపాతం నైరుతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆశగా ఎదురుచూసే నైఋతు ఋతుపవనాలు జూన్ 1న కేరళ రాష్ట్రంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ చల్లని కబురు తెలిపింది. కాగా భారత్ లో అత్యధిక శాతం వర్షపాతం నైరుతి రుతుపవనాల కారణంగానే నమోదయ్యేదనే విషయం తెలిసిందే... వ్యవసాయ రంగానికి ఎంతగానో ఆసరానిచ్చే ఈ ఋతుపవనాల కోసం వ్యవసాయదారులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. తాజాగా, నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ విభాగం (IMD) (ఐఎండీ) ఆసక్తికరమైన ముఖ్యమైన సమాచారాన్నిచ్చింది.
Also Read: Locdown Effect: 180 సీట్లున్న విమానంలో ప్రయాణికులు కేవలం నాలుగురేనా..
గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నరైతాంగం జూన్ 1 నాటికి ఋతుపవనాలు కేరళ వద్ద భారత్ ప్రధాన భూభాగంలో ప్రవేశించనుండడంతో ఊపిరి పీల్చుకోనుంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని అత్యధిక ప్రాంతాల్లో విస్తరిస్థాయని, మరో 48 గంటల్లో మాల్దీవులు-కొమరిన్ ప్రాంతంలోనూ ఋతుపవనాలలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశముందని పేర్కొంది. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడడంతో మరింత బలపడి గల్ఫ్ తీరం దిశగా పయనిస్తుందని సూచించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..