INS Dhruv: ఇండియన్ నేవీలో మరో పవర్‌ఫుల్ అస్త్రం చేరింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన గూడఛారి నౌక ఐఎన్ఎస్ ధ్రువ్ జాతికి అంకితం కానుంది. ఈ నౌక మిగిలిన నౌకల కంటే చాలా భిన్నమైంది. దీని ప్రత్యేకతలిలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ నేవీకు(Indian Navy) మరో శక్తివంతమైన అస్త్రం వచ్చి చేరింది. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో నిర్మితమైన గూడఛారి నౌక ఐఎన్ఎస్ ధ్రువ్ త్వరలో జాతికి అంకితం కానుంది. విశాఖపట్నం హిందూస్తాన్ షిప్‌యార్డ్‌లో తయారైన ఈ నౌకను సెప్టెంబర్ 10వ తేదీన జాతికి అంకితం చేయనున్నట్టు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తెలిపారు. 15 వందల కోట్ల ఖర్చుతో 2015లో ప్రారంభమైన ఈ నౌక నిర్మాణం 2020 అక్టోబర్ నెలలో పూర్తయింది.


శత్రు క్షిపణుల్ని సమర్ధవంతంగా గుర్తించగల సామర్ధ్యంతో పాటు చాలా ప్రత్యేకతలు ఐఎన్ఎస్ ధ్రువ్(INS Dhruv) సొంతం. ఇండియన్ నేవీ డిజైనర్లు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు, హిందూస్తాన్ షిప్‌యార్డ్ నిపుణులు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు ఈ నౌకా నిర్మాణంలో పాల్గొన్నారు. శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్‌తో పాటు ఇతర భూభాగాల్నించి క్షిపణుల ప్రయోగం జరిగితే ధ్రువ్ ద్వారా అటాక్ చేయవచ్చు. అంతేకాదు దేశానికి నష్టం కలగకుండా శత్రు క్షిపణుల్ని ఏ ప్రాంతంలో ధ్వంసం చేయాలనే వివరాల్ని కూడా అందించగలదు. సాధారణ మిస్సైల్స్‌తో పాటు న్యూక్లియర్ మిస్సైల్స్ జాడ కూడా కనిపెట్టగలదు. 


ఐఎన్ఎస్ ధ్రువ్ ఇతర ప్రత్యేకతలు(INS Dhruv Specialities)


దేశాన్ని సునిశితంగా పరిశీలన చేసే శాటిలైన్ మానిటర్ల ఏర్పాటు
అత్యాధునిక సముద్ర నిఘా వ్యవస్థ కలిగిన పీ 5 దేశాల్లో ఇండియా చేరిక
సెన్సార్లతో కూడిన త్రీ డోమ్ సర్వైలెన్స్ సిస్టమ్ ఏర్పాటు
ఎలక్ట్రానిక్ స్కాన్డ్ ఎరే రాడార్స్ టెక్నాలజీ వినియోగం
14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం


మరోవైపు 1971 పాకిస్తాన్‌తో(1971 India pakistan war)జరిగిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణిమ్ విజయ్ వర్ష్‌లో భాగంగా వెలిగించిన విక్టరీ ఫ్లేమ్ విశాఖపట్నం నావికా దళానికి చేరుకుంది. ఈ ఫ్లేమ్ రాక సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 డిసెంబర్ 16న నాలుగు విజయ జ్వాలలు వెలిగించారు. విశాఖపట్నం చేరుకున్న ఈ జ్వాల రాజమండ్రి, విజయవాడ, నల్గొండ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. 


Also read: IBPS clerk prelim results 2021: ఐబిపీఎస్ క్లర్క్ ప్రిలీమ్స్ రిజల్ట్స్ 2021 డైరెక్ట్ లింక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook