Ganesh Chaturthi 2021 special trains: వినాయక చవితి పండగ నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఇండియన్ రైల్వేస్ గణపతి స్పెషల్ ట్రెయిన్స్ పేరిట 261 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు స్పష్టంచేసింది. దేశం నలుమూలలా రాకపోకలు సాగించే ఈ ప్రత్యేక రైళ్ల టికెట్లకు ప్రత్యేక చార్జీలు వసూలు చేయనున్నారు. 261 ప్రత్యేక రైళ్లలో సెంట్రల్ రైల్వే 201 సర్వీసులు నడపనుండగా వెస్టెర్న్ రైల్వే 42 గణపతి స్పెషల్ ట్రెయిన్స్ నడపనుంది. మరో 18 ప్రత్యేక రైళ్లు కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) పరిధిలో సేవలు అందించనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు చివరి నుంచే ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సెప్టెంబర్ 20వ తేదీ వరకు గణపతి స్పెషల్ ట్రెయిన్స్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఏయే మార్గాల్లో ఎన్ని రైళ్లు, ఎప్పుడెప్పుడు రాకపోకలు సాగించనున్నాయనే షెడ్యూల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం అధికారిక వెబ్‌సైట్ www.enquiry.indianrail.gov.in లో చెక్ చేసుకోవచ్చు.


ఈ ప్రత్యేక రైళ్లలో వెళ్లాలనుకునే ప్రయాణికులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. కన్ఫర్మ్‌డ్ టికెట్స్ ఉన్న వారిని మాత్రమే ఈ రైళ్లలోకి అనుమతిస్తారు. అలాగే దేశంలో పలు రాష్ట్రాల్లో కొవిడ్-19 నిబంధనలు (COVID-19 guidelines) అమలులో ఉన్నందున తమ తమ గమ్యస్థానాల్లో ఉన్న స్థానిక పరిస్థితులు, నిబంధనల గురించి తెలుసుకుని వెళ్లడం ఉత్తమం అని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యం కరోనావైరస్ నివారణ కోసం శానిటైజర్స్, ముఖానికి మాస్కులు (Wear masks) వినియోగిస్తూ, సోషల్ డిస్టన్సింగ్ పాటిస్తూ ప్రయాణాలు సాగించడం అత్యవసరం. 


Also read : EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్: దీపావళికి ముందే ఈపీఎఫ్ఓ వడ్డీ జమయ్యే అవకాశం!


ఇదిలావుంటే, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలపై స్థానిక ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కరోనావైరస్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను (Vinayaka Chavithi celebrations 2021) బహిరంగంగా మండపాల్లో కాకుండా ఇళ్లలోనే నిర్వహించుకుని కరోనా నివారణకు తోడ్పాటును అందించాల్సిందిగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. అదే సమయంలో ఇంకొన్ని రాష్ట్రాల్లో కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ గణేష్ చతుర్థి వేడుకలు (Ganesh chaturthi 2021) జరుపుకునేందుకు ప్రభుత్వాలు అనుమతించాయి.


Also read : Heavy rains updates: ఈ జాబితాలోని రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. IMD నివేదిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook