Vinayaka Chaturthi: సీఎం జగన్ పెళ్లి రోజు వేడుకలకు కరోనా అడ్డం రాలేదా: నారా లోకేష్

Vinayaka chavithi celebrations in AP: కరోనావైరస్ వ్యాప్తిని కారణంగా చూపుతూ వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్ వెయ్యడం, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నందున పండుగను వ్యక్తిగతంగా ఇళ్లలో మాత్రమే జరుపుకోవాలంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని నారా లోకేష్ (Nara Lokesh) అభ్యంతరం వ్యక్తంచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2021, 11:21 PM IST
  • వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతూ నారా లోకేష్ బహిరంగ లేఖ.
  • కరోనా కారణాన్ని చూపించి అనుమతులు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని హితవు.
  • ఇతర వేడుకలకు అడ్డం రాని కరోనా నిబంధనలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించిన లోకేష్
Vinayaka Chaturthi: సీఎం జగన్ పెళ్లి రోజు వేడుకలకు కరోనా అడ్డం రాలేదా: నారా లోకేష్

Vinayaka chavithi celebrations in AP: అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి బహిరంగ లేఖ రాశారు. కరోనావైరస్ వ్యాప్తిని కారణంగా చూపుతూ వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్ వెయ్యడం, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నందున పండుగను వ్యక్తిగతంగా ఇళ్లలో మాత్రమే జరుపుకోవాలంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని నారా లోకేష్ (Nara Lokesh) అభ్యంతరం వ్యక్తంచేశారు. వినాయక చవితి వేడుకలకు అనుమతి నిరాకరించడం వల్ల రాష్ట్రంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని నారా లోకేష్ పేర్కొన్నారు. 

విఘ్నాలు తొలగించే వినాయకుని పండగకే విఘ్నాలు కల్పించడం మంచిది కాదన్న నారా లోకేష్... వినాయక చవితి ఉత్సవాలపై (Vinayaka chaturthi celebrations) ఏ రాష్ట్రం పెట్టని నిబంధనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే పెట్టడంలో అర్థమేంటి అని ప్రశ్నించారు. కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో మద్యం అమ్మకాలు విచ్చల విడిగా జరిపారు. అన్ని నియోజకవర్గాల్లో కనీస కోవిడ్ నిబంధనలు (COVID-19 guidelines) పాటించకుండానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని భారీ జన సమీకరణతో వేడుకగా జరిపారు కదా అని నారా లోకేష్ గుర్తుచేశారు. 

Also read : YS Jagan: మీడియాపై విమర్శలు ఎక్కుపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ఈ సందర్భంగా ప్రభుత్వం వైఖరిని తన బహిరంగ లేఖలో ప్రస్తావించిన నారా లోకేష్.. మీ 25వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా అన్ని చోట్లా హడావిడిగా జరిపినప్పుడు, మీకు సంబంధించిన ఏ కార్యక్రమానికి అడ్డురాని కోవిడ్ నిబంధనలు వినాయక చవితి వేడుకలకు (Vinayaka chavithi celebrations) ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కరోనా నిబంధనల పేరు చెప్పి మతసామరస్యాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తిచేశారు. 

దయచేసి మీ నిర్ణయాన్ని వెంటనే మార్చుకొని కరోనా వైరస్ నిబంధనలు (Coronavirus) పాటిస్తూ వినాయక చవితి బహిరంగ వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నట్టు నారా లోకేష్ (Nara Lokesh) తన లేఖలో పేర్కొన్నారు.

Also read : AP Corona Update: ఏపీలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు, 24 గంటల్లో కేవలం 739 కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News