ఇండియన్ రైల్వేస్ అన్ని‌స్పెషల్ ట్రైన్లకు ( Special Trains ) సంబంధించి తత్కాల్ బుకింగ్ ను ప్రారంభించింది.  కరోనా కాలంలో  తత్కాల్ టికెట్ల  బుకింగ్ ( Tatkal Ticket Booking ) ను ఐఆర్ సిటిసి ( IRCTC )రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్‌ 2లో ( Unlock  2)  భాగంగా ఇండియన్ రైల్వేస్ యాత్రికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 25 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ( Lockdown ) విధించిన తరువాత ప్యాసెంజర్, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. Also Read : PM Modi speech highlights: ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్స్

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అయితే జూన్ 29 నుంచి స్పెషల్ ట్రైన్లకు తత్కాల్ బుకింగ్‌ను ప్రారంభించనున్నట్టు రైల్వే శాఖ‌ మే 31 తేదీన ఒక ప్రకటన చేసింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ట్రైన్లకు సోమవారం నుంచే  తత్కాల్ బుకింగ్ ప్రారంభం అయింది.