PM Modi speech highlights: న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనావైరస్పై గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ చేస్తూ అన్లాక్-2 దశలోకి ( Unlock 2.0 ) ప్రవేశించామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని హైలైట్స్ ఇలా ఉన్నాయి. కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భారత్ మెరుగ్గా ఉందన్న ప్రధాని మోదీ.. సరైన సమయంలో లాక్డౌన్ ( Lockdown) చేపట్టడంతో పాటు కేంద్రం తీసుకున్న ఇతర నిర్ణయాల వల్ల లక్షలాది మంది భారతీయుల ప్రాణాలను రక్షించుకోగలిగామని అభిప్రాయపడ్డారు. అన్లాక్-1 దశతో పోల్చుకుంటే.. అన్లాక్-2 మార్గదర్శకాలు విషయంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. అయితే, వాతావరణం మార్పులు కూడా చోటుచేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో అనారోగ్యం దరిచేరకుండా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. కానీ జనం వైపు నుంచి కొంత నిర్లక్ష్యం కనిపిస్తోందని అన్నారు. లాక్డౌన్ వేళ నియమాలను ఎలాగైతే కఠినంగా పాటించారో.. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు, ప్రజలు అలాగే కఠిన నియమాలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ( Also read: Chinese apps banned: చైనా యాప్స్ నిషేధం.. స్పందించిన చైనా సర్కార్ )
కంటైన్మెంట్ జోన్స్ ( Containment zones ) విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిందిగా ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలకు సూచించారు. కోవిడ్-19 నియమావళిని పాటించే విషయంలో దేశ ప్రధాని అయినా.. గ్రామానికి పెద్దయినా.. చట్టానికి అతీతులు కాదు. కరోనావైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించని వారికి ఆ పద్ధతులను నేర్పించాలి. కోవిడ్-19 నిబంధనలు ( COVID-19 guidelines ) ఉల్లంఘించిన నేరం కింద ఒక దేశ ప్రధానికి జరిమానా విధించిన వైనాన్ని మీరు వార్తల్లో చూసే ఉంటారనే విషయాన్ని గుర్తుచేస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ( Also read : Mann Ki Baat: చైనాకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! )
గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ( Garib Kalyan Anna Yojana ) నవంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ స్పష్టంచేశారు. గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధాని తెలిపారు. కుటుంబంలోని ప్రతీ ఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు, నెలకు కిలో చొప్పున కందిపప్పు ఉచితంగా అందించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం అమలు కోసం కేంద్రం రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని కేటాయించినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు.
9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు డిపాజిట్ చేసినట్లు ప్రధాని తెలిపారు.
ప్రధాని జన్ ధన్ యోజన పథకం కింద జన్ ధన్ ఖాతాదారులకు ( PM Jan dhan yojana scheme ) ఆర్థికంగా భరోసా ఇస్తూ గత 3 నెలల్లో 20 కోట్ల పేద ప్రజలకు రూ. 31 వేల కోట్లు జమ చేసినట్టు ప్రధాని వెల్లడించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..