Baby Berths In Trains: రైళ్లలో చిన్న పిల్లలతో ప్రయాణించే వారికి ఇదో పెద్ద రిలీఫ్. చిన్నారులు హాయిగా ప్రయాణించడం కోసం, చిన్నారులను వెంటపెట్టుకుని ప్రయాణించే తల్లిదండ్రుల సౌకర్యం కోసం ఇండియన్ రైల్వే ఓ సరికొత్త ఐడియాతో ప్రయాణికుల ముందుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక సౌకర్యమే బేబీ బెర్త్‌ల ఏర్పాటు. అవును.. ఇకపై చిన్నారులతో ప్రయాణించే వారికి రైలు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చిన్నారుల కోసం బేబీ బెర్తులు రానున్నాయి. అయితే, ప్రస్తుతం ఇది పైలట్ ప్రాజెక్ట్ దశలోనే ఉంది. తొలిసారిగా లక్నో మెయిల్‌లో ప్రయోగాత్మకంగా ఈ బేబీ బెర్తులను ఏర్పాటు చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోయర్ మెయిన్ బెర్తుకు పక్కనే ఆనుకుని ఉండేలా ఈ ఫోల్డబుల్ బెర్తును బిగించారు. ట్రెయిన్ నెంబర్ 12229, ట్రెయిన్ నెంబర్  12230 లక్నో మెయిల్‌ రైళ్లలో B4 కోచ్‌లో 12, 60 నెంబర్ బెర్తులకు ఈ బేబీ బెర్తులు అమర్చినట్టు ఇండియన్ రైల్వే తమ తాజా ప్రకటనలో పేర్కొంది. బేబీ బెర్త్ సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటుందని భారతీయ రైల్వే అభిప్రాయపడింది. అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకుని అసరరం లేనప్పుడు ఫోల్డ్ చేసే విధంగా ఈ బేబీ బెర్త్ డిజైన్ ఉంటుంది. 



ఈ రెండు రైళ్లలో బేబీ బెర్తులకు వచ్చిన స్పందన ఆధారంగా భవిష్యత్తులో ఇతర రైళ్లలో కూడా ఈ సౌకర్యం విస్తరింపజేసే ఆలోచనలో ఉన్నట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈసారి ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా బేబీ బెర్తుల అంతిమ డిజైన్ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇండియన్ రైల్వే (Indian Railways) ప్రవేశపెట్టిన బేబీ బెర్తుల ఫోటోలు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ విపరీతంగా షేర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో లభిస్తున్న స్పందననుబట్టి చూస్తే.. బేబీ బెర్తులకు రైలు ప్రయాణికుల నుంచి మంచి డిమాండే ఉండేలా కనబడుతోంది.


Also read : LIC IPO Shares Allotment Status: ఎల్ఐసి ఐపిఓ షేర్స్ అలాట్‌మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ?


Also read : Realme Narzo 50 5G Launch: రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్.. ఫీచర్స్ ఏంటంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.