Indian Railways Rules: రైలు ప్రయాణికులు ఈ తప్పులు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పుదు!

Indian Railways Rules: మీరు తరచూ రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ వార్త గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే రైల్వే శాఖ కొన్ని నిబంధనలను మళ్లీ అమలులోకి తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన హెచ్చరికను ప్రయాణికులకు జారీ చేసింది. వాటిని పాటించపోతే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 07:19 PM IST
Indian Railways Rules: రైలు ప్రయాణికులు ఈ తప్పులు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పుదు!

Indian Railways Rules: రైలు ప్రయాణికులకు హెచ్చరిక. ఇకపై రైల్లో ప్రయాణించే వారు కచ్చితంగా ఈ నిబంధనలను పాటించాలని భారతీయ రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ రైల్లో ప్రయాణించే సమయంలో వాటిని అతిక్రమిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు భారతీయ రైల్వే శాఖ స్పష్టం చేసింది. అయితే రైల్లో ప్రయాణించే వారు చేయకూడని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ట్వీట్ చేసిన రైల్వే శాఖ..

రైల్లో ప్రయాణించే వారు తమతో పాటు తీసుకెళ్లకూడని వస్తువుల గురించి ట్విట్టర్ లో వెల్లడించింది. ప్రయాణికులు తమతో పాటు మండే పదార్థాలను మోసుకెళ్లడం లేదా తీసుకెళ్లడం నిషిద్ధం. ఒకవేళ అలాంటి వాటిని తీసుకెళ్తూ పట్టుబడినా.. వారికి జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164 ప్రకారం రైల్లో మందుగుండు, పేలుడు సామాగ్రిని తీసుకెళ్లడం నిషేధం. దీన్ని ఉల్లంఘిస్తే.. మూడేళ్ల జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండు కలిపి విధించవచ్చని స్పష్టం చేసింది. 

రైల్లో నిషేధించిన వస్తువులు..

రైల్వే శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కిరోసిన్, ఎండు గడ్డి, స్టవ్, పెట్రోల్, కిరోసిన్, గ్యాస్ సిలిండర్, అగ్గిపెట్టెలు, బాణసంచా లేదా మంటలు వ్యాపించడానికి అవకాశం ఉండే వస్తువులను ప్రయాణికులు తమతో పాటు తీసుకెళ్లకూడదు. ప్రయాణికుల భద్రత, సురక్షిత కోసమే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

రైల్వే ప్రాంగణాల్లో ధూమపానం నిషేధం..

అగ్నిప్రమాదాలను నియంత్రించేందుకు రైల్వేలు రూపొందించిన నిబంధనల ప్రకారం.. రైల్లో ప్రయాణించే వారు లేదా రైలు ప్రాంగణంలో పొగ త్రాగరాదు. ఒకవేళ ఎవరైనా ఇలా చేసి పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధించే అవకాశం ఉంది. 

Also Read: Truecaller Call Recording: Truecaller వినియోగదారులకు గమనిక.. ఇకపై యాప్ లో ఆ ఫీచర్ పనిచేయదు!

Also Read: Flipkart Poco M4 Pro: రూ.1,249 ధరకే Poco M4 Pro కొనుగోలు చేయోచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News