LIC IPO Shares Allotment Status: ఎల్ఐసి ఐపిఓ షేర్స్ అలాట్‌మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ?

LIC IPO Shares Allotment Status: ఎల్ఐసి ఐపిఓలో షేర్స్ కొనుగోలు చేసిన వారికి ఆ షేర్స్‌ని మే 12వ తేదీన అలాట్‌మెంట్ చేస్తారనే విషయం తెలుసుకానీ ఆ అలాట్‌మెంట్ స్టేటస్‌ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయంలోనే కొంత మందికి సరైన క్లారిటీ లేదు. అంతేకాకుండా ఎల్ఐసి షేర్స్ కేటాయింపులు గురించి తెలుసుకునేందుకు ఏయే వివరాలు అవసరం అని తెలిపే ప్రయత్నమే ఈ వార్తా కథనం.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 06:58 PM IST
  • ఇన్వెస్టర్స్ నుంచి ఎల్ఐసి ఐపీఓకు ఊహించినదానికంటే రెట్టింపు స్పందన
  • సబ్‌స్క్రైబర్స్‌కి ఎల్ఐసి వాటాలు కేటాయించనున్న ఎల్ఐసి సంస్థ
  • మే 17న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ అవనున్న ఎల్ఐసి స్టాక్స్
LIC IPO Shares Allotment Status: ఎల్ఐసి ఐపిఓ షేర్స్ అలాట్‌మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ?

LIC IPO Shares Allotment Status: ఎల్ఐసి ఐపిఓలో షేర్స్ సబ్‌స్క్రిప్షన్ కోసం మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఔత్సాహిక పెట్టుబడిదారులకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్స్ నుంచి ఎల్ఐసి ఐపీఓకు ఊహించినదానికంటే అధికంగా స్పందన లభించింది. దేశంలోనే అతి పెద్ద జుంబో ఐపిఓగా పేరొందిన ఎల్ఐసి ఐపీఓలో షేర్స్ సొంతం చేసుకునేందుకు భారీ మొత్తంలో ఇన్వెస్టర్స్ పోటీపడ్డారు. మే 12వ తేదీన ఎల్ఐసి షేర్స్ అలాట్‌మెంట్ ప్రక్రియ జరగనుంది. దీంతో ఎల్ఐసిలో షేర్స్ కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్న వారి దృష్టి అంతా ప్రస్తుతం షేర్స్ కేటాయింపులపైనే ఉంది. 

మే 12న గురువారం ఎల్ఐసి ఐపిఓ సబ్‌స్క్రైబర్స్‌కి ఎల్ఐసి వాటాలు కేటాయించనుండగా.. మే 17న నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బీఎస్ఈ)లో లిస్ట్ అవనున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఐసి షేర్స్ అలాట్‌మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే సందేహం కొంతమంది పెట్టుబడిదారులను వేధిస్తోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

ఎల్ఐసీ ఐపీఓలో షేర్స్ అలాట్‌మెంట్ స్టేటస్ తెలియాలంటే.. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు లేదా నేరుగా https://www.bseindia.com/investors/appli_check.aspx ఈ లింకుపై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేస్తే వచ్చే వెబ్‌పేజీలో షేర్స్ వివరాలు, ఇష్యూ పేరు, అప్లికేషన్ నెంబర్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (ప్యాన్ నెంబర్) వంటి వివరాలు ఇవ్వడం ద్వారా షేర్స్ ఎలాంట్‌మెంట్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎల్ఐసి ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ చివరి రోజైన సోమవారం సాయంత్రం చివరి నిమిషం వరకు ఎల్ఐసి షేర్స్ బిడ్డింగ్‌లో (LIC IPO Bidding) పోటీ కనిపించింది. మొత్తం 2.95 రెట్లు ఎల్ఐసి ఐపీఓ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

Also read : SBI FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంపు

Also read: Apple iPhone Offers: Apple iPhone 12, iPhone 13 మోడల్స్ పై ఆన్ లైన్ లో భారీ డిస్కౌంట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News