Indian Railways: రైల్వేశాఖలో విషాదం, COVID-19 బారిన పడి 1952 మంది ఉద్యోగులు మృతి
Indian Railway Employees | విధంగా కరోనా వైరస్ పరివర్తనం చెంది రూపాంతరం చెందడంతో కరోనా సెకండ్ వేవ్‌లో భారీగా కేసులు పెరగడంతో పాటు కరోనా మరణాలు నమదవుతున్నాయి. దేశంలో అత్యధిక ఉద్యోగులు ఉన్న సంస్థ రైల్వే శాఖలో కరోనా తీవ్రత అధికమైందని అధికారులు చెబుతున్నారు.
Indian Railways : గత ఏడాది మార్చి నెలలో భారత్‌లో కరోనా వైరస్ కేసులు ఆందోళన రేపాయి. మరోసారి సెకండ్ వేవ్‌లో అదే స్థాయిలో కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్ వరకు బాధితుల లక్షణాలు మారాయి. అదే విధంగా కరోనా వైరస్ పరివర్తనం చెంది రూపాంతరం చెందడంతో కరోనా సెకండ్ వేవ్‌లో భారీగా కేసులు పెరగడంతో పాటు కరోనా మరణాలు నమదవుతున్నాయి. దేశంలో అత్యధిక ఉద్యోగులు ఉన్న సంస్థ రైల్వే శాఖలో కరోనా తీవ్రత అధికమైందని అధికారులు చెబుతున్నారు.
ప్రతిరోజూ రైల్వేశాఖకు సంబంధించి 1000 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని రైల్వే బోర్డు చీఫ్ సునీత్ శర్మ తెలిపారు. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకూ కోవిడ్19 మహమ్మారి 1,952 మంది రైల్వే ఉద్యోగులకు పొట్టన పెట్టుకుంది. సరుకుల రవాణాతో పాటు వ్యాపార సంబంధ, ప్రజలకు సైతం సేవలు రైల్వే శాఖ సేవలు అందిస్తుందన్నారు. 13 లక్షల ఉద్యోగులతో ప్రపంచంలోనే ఉద్యోగుల పరంగా అతిపెద్ద సంస్థగా నిలిచిన భారత రైల్వే శాఖ ఉద్యోగులు కరోనా మహమ్మారితో పోరాడుతూ నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు.
Also Read: Dangerous Strain: ఇండియాలో గుర్తించిన వైరస్ వేరియంట్ అతి ప్రమాదకరం
‘రైల్వే ఉద్యోగులకు ప్రత్యేకమైన ఆసుపత్రులు ఉన్నాయి. వాటిలో బెడ్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాం. ఆక్సిజన్ ప్లాంటులు సైతం ఏర్పాటు చేశాం. ప్రస్తుతం రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబాలు దాదాపు 4000 కరోనా బెడ్లపై ఉన్నారు. వారంతా కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకూ ఈ శాఖకు సంబంధించి 1952 మంది ఉద్యోగులు కరోనాతో కన్నుమూశారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రకటించిన తరహాలోనే వీరికి సైతం రూ.50 లక్షలు పరిహారం అందించాలని రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు లేఖ రాసినట్లు’ రైల్వే బోర్డు చీఫ్ సునీత్ శర్మ తెలిపారు.
Also Read: Corona Second Wave: ఛాతిలో నొప్పి కరోనా వైరస్ కొత్త లక్షణమా, నిపుణులు ఏమన్నారంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook