న్యూ ఢిల్లీ: Indian Railways: ఇండియన్ రైల్వే మార్చి 21 నుంచి 31 మధ్య రద్దు చేసిన ప్రయాణికుల అన్ని టికెట్స్‌కి నగదును తిరిగి సదరు రైలు ప్రయాణికులకు చెల్లించింది. ఆన్‌లైన్‌లో ఐఆర్‌సిటిసి ఎకౌంట్ ( IRCTC account ) ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ రద్దు చేసిన టికెట్స్ మొత్తానికి అయిన నగదును వారి వారి ఖాతాల్లో జమ చేసింది. రైలు ప్రయాణికులు తమ నగదు కోసం పీఆర్ఎస్ కౌంటర్లకు రావాల్సిన అవసరం లేకుండా సకాలంలోనే వారికి టికెట్ డబ్బులను చెల్లించామని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఏ ఖాతా నుంచి అయితే నగదును చెల్లించారో.. అవే బ్యాంకు ఖాతాల్లో తిరిగి నగదు జమ చేసినట్టు భారతీయ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. టికెట్ రద్దు చేసుకున్న అందరు ప్రయాణికులకు కలిపి రూ.1,885 కోట్లు చెల్లించినట్టు రైల్వే శాఖ స్పష్టంచేసింది. ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లే రైళ్లు ఇవే )


కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 25 నుంచి కేంద్రం రైళ్లు రద్దు చేసింది. రైలు ప్రయాణాలతో సామాజిక దూరం పాటించడం కష్టమని భావిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, అప్పటికే ఎంతో మంది రైలు ప్రయాణికులు బుక్ చేసుకుని ఉన్నారు. దీంతో అలా రద్దయిన రైళ్లలో టికెట్స్‌ బుక్ చేసుకున్న వారికి అయ్యే మొత్తాన్ని తిరిగి చెల్లించడం ఇండియన్ రైల్వేకి అనివార్యమైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..