న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా దేశంలో పలు రైళ్లు, విమానాల సర్వీసులు దాదాపు నలభై రోజుల కిందటే రద్దయ్యాయి. దీనివల్ల వలస కార్మికులు, కూలీలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి సమస్యలు ఎదుర్కొంటున్నారు. నేడు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రైల్వే శాఖ తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు ప్రత్యేక రైలు సర్వీస్‌ను నడుపుతోంది. వలస కూలీలు, కార్మికుల కోసం మరిన్ని ప్రత్యేక రైలు సర్వీసులు నడిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఏపీలో కరోనా విజృంభణ.. తాజాగా 60 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో చిక్కుకుపోయిన 1200 మంది జార్ఖండ్ కార్మికులను సొంతగూటికి చేర్చడంలో భాగంగా ప్రత్యేక రైలు సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. నేటి ఉదయం 5 గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి హతియా (జార్ఖండ్) వలస కార్మికులతో రైలు బయలుదేరిందని ఆర్పీఎఫ్ డీజీ అరుణ్ కుమార్ పీటీఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.  యాంకర్ అనసూయ ఫన్నీ ఫొటోషూట్


సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ వద్ద చిక్కుకుపోయిన వందలాది వలస కార్మికులు మరికొన్ని గంటల్లో సొంత చేరనున్నారు. జార్ఖండ్ రాష్ట్రం వినతి మేరకు రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని కార్మికులను లింగంపల్లి ర్వైల్వే స్టేషన్‌కు చేర్చింది. అక్కడి నుంచి జార్ఖండ్ వలస కార్మికులను పోలీసులు, అధికారులు, ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి చప్పట్లు కొట్టి స్టేషన్ నుంచి వీడ్కోలు పలికారు. లాక్ డౌన్ మొదలయ్యాక ఇదే తొలి సర్వీసు కావడం గమనార్హం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos