Railway New Changes: జనవరి 1, 2022 నుంచి భారతీయ రైల్వే కీలక మార్పుు చేస్తోంది. కరోనా మహమ్మారి కంటే ముందున్న పరిస్థితి వస్తోంది. రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేసే వెసులుబాటు తిరిగి వస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైలు ప్రయాణీకులకు ఇది గుడ్‌న్యూస్. భారతీయ రైల్వే కొత్త సంవత్సరం నుంచి ప్రయాణీకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ప్రారంభించనుంది. రిజర్వేషన్ లేకుండానే ఇకపై ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తోంది. కరోనా మహమ్మారికి ముందున్నట్టే జనరల్ కోచ్‌లలో రిజర్వేషన్ లేకుండా ప్రయామం చేయవచ్చు. కరోనా మహమ్మారి కారమంగా రైల్వే ఈ సౌకర్యాన్ని తొలగించింది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న క్రమంలో పాత పద్ధతుల్ని తిరిగి అమలు చేయనుంది. 


జనవరి 1 2022 నుంచి 


భారతీయ రైల్వే (Indian Railway) జనవరి 1, 2022 నుంచి జనరల్ కోచ్‌లలో రిజర్వేన్ లేకుండా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే కొత్త సంవత్సరం నుంచి ప్రయాణీకులు జనరల్ టికెట్‌పైనే ప్రయాణం చేయవచ్చు. అయితే తొలిదశలో కొన్ని ప్రత్యేక రైళ్లలో ఈ పాత సౌకర్యం కల్పించింది. ఆ రైళ్ల జాబితా పరిశీలిద్దాం.


1. రైలు నెంబర్ 12531, గోరఖ్‌పూర్ నుంచి లక్నో ఎక్స్‌ప్రెస్ రైలులో డి 12 నుంచి డి 15 మరియు, డీఎల్ 1 కోచ్‌లు
2. రైలు నెంబర్ 12532, లక్నో నుంచి గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో డీ12 నుంచి డీ 15 మరియు డీఎల్ 1 కోచ్‌లు
3. రైలు నెంబర్ 15007 వారణాసి సిటీ నుంచి లక్నో మరియు రైలు నెంబర్ 15008 లక్నో నుంచి వారణాసి సిటీ రైళ్లలో డీ8 మరియు డీ9 కోచ్‌లు
4. రైలు నెంబర్ 15009 గోరఖ్‌పూర్ నుంచి మైలానీ ఎక్స్‌ప్రెస్ రైలు, 15010 మైలానీ నుంచి గోరఖ్‌పూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో డీ6, డీ7, డీఎల్ 1, డీఎల్ 2 కోచ్‌లు
5. రైలు నెంబర్ 15043 లక్నో నుంచి కాఠ్‌గోదామ్ ఎక్స్‌ప్రెస్ రైలు, 15044 కాఠ్‌కోదామ్ నుంచి లక్నో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డీ5, డీ6, డీఎల్ 1, డీఎల్ 2 కోచ్ లు
6. రైలు నెంబర్ 15053 ఛప్రా నుంచి లక్నో, 15054 లక్నో నుంచి ఛప్రా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డీ7, డీ8 కోచ్‌లు
7. రైలు నెంబర్ 15069 గోరఖ్‌పూర్ నుంచి ఏశ్‌బాగ్, 15070 ఏశ్‌బాగ్ నుంచి గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డీ12, డీ14, డీఎల్ 1 కోచ్‌లు
8. రైలు నెంబర్ 15084 ఫరూఖాబాద్ నుంచి ఛప్రా, 15083 ఛప్రా నుంచి ఫరూఖాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డీ7, డీ8 కోచ్‌లు
9. రైలు నెంబర్ 15013 గోరఖ్‌పూర్ నుంచి బనారస్, 15014 బనారస్ నుంచి గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డీ14, డీ15 కోచ్‌లు
10. రైలు నెంబర్ 15105 ఛప్రా నుంచి నౌతన్వా
, 15106 నౌతన్వా నుంచి ఛప్రా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డీ12, డీ13 కోచ్‌లు
11. రైలు నెంబర్ 15113 గోమతీ నగర్ నుంచి ఛప్రా కచేరీ, 15114 ఛప్రా కచేరీ నుంచి గోమతీ నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డీ8, డీ9 కోచ్‌లు


కరోనా మహమ్మారి (Corona Pandemic) కారణంగా గతంలో జనరల్ కోచ్‌లలో ప్రయణాన్ని రైల్వేశాఖ నిలిపివేసింది. ఇప్పుడు తిరిగి జనవరి 1 నుంచి ఆ సౌకర్యాన్ని ప్రారంభిస్తుంది. పైన ఉదహరించన రైళ్లలో , ఆ నెంబర్ కోచ్‌లలో రిజర్వేషన్ లేకుండా జనరల్ టికెట్‌పై ప్రయాణం చేయవచ్చు. అయితే ప్రయాణం సందర్భంగా కరోనా గైడ్‌లైన్స్‌ను (Corona Guidelines) ప్రయాణీకులు విధిగా పాటించాల్సి ఉంది. 


Also read: Whatsapp New Feature: వాట్సప్ కొత్త ఫీచర్, ఈ ట్రిక్ ద్వారా మీ పేరు మాయం చేయవచ్చు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి