AC Economy Coach: అందరికీ అందుబాటులో రైల్వే అనేది రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయం. అందుకే ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు సరికొత్త వసతులతో ముందుకొస్తోంది. రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ఏసీ ఎకానమీ కోచ్‌లు త్వరలో పట్టాలకెక్కనున్నాయి. ఆ కోచ్‌ల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ రైల్వేస్(Indian Railways)ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలు, వసతులతో ప్రయాణీకులకు మెరుగైన సేవలందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సామాన్యులకు సైతం ఏసీ ప్రయాణం అందించేందుకు ఏసీ ఎకానమీ కోచ్‌లు ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం రైల్వేలో ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్‌క్లాస్ కేటగరీలున్నాయి. ఇవికాకుండా గరీబ్‌రథ్ ఏసీ రైళ్లు, కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ ఛెయిర్ కార్‌లు ఉన్నాయి. ఏసీ ఛెయిర్ కార్, థర్డ్ క్లాస్ కంటే తక్కువ ధరకు అంటే సామాన్యులకు ఏసీ ప్రయాణం అందుబాటులో తెస్తోంది రైల్వే శాఖ. ఇవే ఏసీ ఎకానమీ కోచ్‌లు. 


వివిధ కోచ్‌ ఫ్యాక్టరీలో ఇప్పటికే 50కి పైగా ఏసీ ఎకానమీ కోచ్‌లు(Ac Economy Coach)తయారయ్యాయి. వీటిని వివిధ జోన్లకు కేటాయించారు. వీటిని లింకే హఫ్‌మన్‌ బుష్‌ టెక్నాలజీతో తయారు చేశారు. ఇంటీరియర్‌ మొత్తం స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏసీ కోచ్‌ల కంటే ఎకానమీ కోచ్‌లలో సౌకర్యాలు బాగున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ఏసీ థర్డ్‌క్లాస్ టిక్కెట్ ధర కంటే 8 శాతం తక్కువగా ఏసీ ఎకానమీ కోచ్ ధరల్ని నిర్ణయించారు. అంటే స్లీపర్ క్లాస్ టికెట్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ధర ఉంటుంది. ఈ కోచ్ లో కనీస ఛార్జ్ 440 రూపాయలుగా ఉంది. ఏసీ ఎకానమీ కోచ్ తొలి ట్రైన్..నార్త్ సెంట్రల్ రైల్వే జోన్‌లో(North Central Railway Zone) ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6వ తేదీన ప్రయాగ్‌రాజ్ నుంచి జైపూర్(Prayagraj to Jaipur)వెళ్లే రైలులో తొలిసారిగా ఈ కోచ్ ప్రవేశపెడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఈ కోచ్‌లు ఎప్పుడు కేటాయిస్తారనేది ఇంకా స్పష్టత లేదు. 


Also read: Yo Yo Honey Singh: గృహ హింస కేసు విచారణ.. కన్నీటి పర్యంతమైన Shalini Talwar


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook