IRCTC: భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఇప్పుడు మరింత ఆకర్షణగా మారనుంది. వెబ్‌సైట్ ఫీచర్లు ప్రత్యేకంగా తీర్చిదిద్దుకోనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఐఆర్సీటీసీ ( IRCTC )..కొత్త మార్పులు చేపడుతోంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన వెబ్‌సైట్ ( Website )‌ను మరింత ఆకర్షణీయంగా మార్చబోతోంది. ప్రయాణీకుల్ని ఆకట్టుకునేందుకే కొత్త మార్పులు చేపడుతున్నట్టు  రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న మార్పులతో ప్రయాణీకులకు నిరంతరాయంగా బుకింగ్ ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుందని చెప్పారు. 


వెబ్‌సైట్‌లో చేస్తున్న మార్పుల ద్వారా ఆన్‌లైన్ టికెట్ బుక్ ( Online Ticket Booking ) చేసుకునే ప్రయాణీకులకు మరింత ఫ్రెండ్లీ సౌకర్యం కలుగుతుందన్నారు. రైలు టిక్కెట్ బుక్ చేసుకునేందుకు ముందుగా సందర్శించే వెబ్‌సైట్‌గా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ అప్‌గ్రేడ్ పని జరుగుతుందన్నారు. ఏరోజుకారోజే టిక్కెట్ల బుకింగ్  ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 


Also read: Bank Jobs 2020: రాత ప‌రీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్.. నోటిఫికేషన్ వచ్చేసింది