భారత్‌లో 7లక్షలు దాటిన కరోనా కేసులు
India Corona Positive cases | జులై నెలలో కేవలం 6 రోజుల్లోనే లక్షా 34వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో దేశంలో 2760 మంది కరోనా బాధితులు మృత్యువాతపడటం విచారకరం. అయితే వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు పాటించడం, సోషల్ డిస్టాన్సింగ్ ముఖ్యమని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో అంతకంతకూ విజృంభిస్తోంది. వైరస్ ప్రభావం అధికం కావడంతో అత్యధిక కేసులున్న దేశాలలో అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడో స్థానంలో భారత్ నిలిచింది. గత అయిదారు రోజులుగా కనీసం 20వేలకు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,252 కరోనా పాజిటివ్ కేసులు (India COVID19 case) నిర్ధారించారు. వీటితో కలిపి దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య (India Corona Positive cases) 7,19,665కి చేరింది. Covid19: కరోనా వైరస్ కు మందు ఈ నెలలోనే
అదే సమయంలో నిన్న ఒక్కరోజే దేశంలో 467 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. ఇప్పటివరకూ దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 20,160కి చేరడం ఆందోళన రేపుతోంది. మొత్తం కేసులకుగానూ 4,39,948 మంది చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 2,59,557 కోవిడ్19 పాజిటివ్ కేసులున్నాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్
భారత్‌లో ఇప్పటివరకూ (జులై 6 వరకు) 1,02,11,092 శాంపిల్స్‌కు కోవిడ్19 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తాజా ప్రకటనలో తెలిపింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos