కరోనా వైరస్ కు మందుగా ప్రాచుర్యంలో ఉన్న రెమిడెసివిర్ ( Remdesivir) మందును మరో ఇండియన్ కంపెనీ ఇప్పుడు మార్కెట్ లో లాంచ్ చేయబోతోంది. సిప్లా, హెటిరో తరువాత ఈ డ్రగ్ ను లాంచ్ చేస్తున్న మూడో కంపెనీగా ఖ్యాతి దక్కించుకోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటికంటే కాస్త తక్కువ ధరకే ఈ మందును అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
కరోనా మహమ్మారి ( Corona pandemic) రోజురోజుకూ కోరలు చాచుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన రోగుల సంఖ్య విషయంలో ఇండియా ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుంది. 6 లక్షల 97 వేల కేసులతో రష్యాను దాటుకుని ముందుకెళ్లింది. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ కు ఇటీవలే అందుబాటులో వచ్చిన మందు రెమిడెసివిర్ కు ప్రాధాన్యత ఏర్పడింది. పేటెంట్ కంపెనీ గిలియడ్ సైన్సెస్ (Gilead sciences) కు చెందిన రెమిడెసివిర్ కరోనా చికిత్సలో సానుకూల ఫలితాలనిస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. ఇప్పటికే దేశీయంగా రెండు కంపెనీలు ఈ మందును బారత మార్కెట్ లో ప్రవేశపెట్టాయి. సిప్లా (Cipla) కంపెనీకు చెందిన సిప్రెమిని 5 వేల కంటే తక్కువ ధరకు లభిస్తుండగా..హెటిరో ( Hetero) కంపెనీ కోవిఫర్ ను 5 వేల 4 వందలకు అందిస్తోంది. ఈ పరిస్థితుల్లో మూడవ కంపెనీగా ఇదే మందును డెస్రెం పేరుతో భారతదేశానికి చెందిన మైలాన్ ఫార్మాస్యూటికల్స్ లాంచ్ చేయబోతోంది. ఈనెలలోనే డెస్రెం ను లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు కంపెనీల ధరల కంటే తక్కువకు అంటే వంద మిల్లీగ్రాముల డోస్ ను 4 వేల 8 వందలకు అందించనున్నట్టు మైలాన్ ( Mylan) స్పష్టం చేసింది. ఇప్పటికే డీసీజీఐ సైతం ఈ కంపెనీకు అనుమతి కూడా ఇచ్చింది. Also read: TikTok: భారతీయుల డేటాను టిక్ టాక్ ఎక్కడ దాచింది?
ఇదే మందును మార్కెట్ చేసే కంపెనీల సంఖ్య పెరిగే కొద్దీ ఆ మందు ధర మరింతగా తగ్గనుంది. Also read: AP: ఆన్ లైన్ తరగతులపై చర్యలు తప్పవు: విద్యాశాఖ
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..