భారత్‌లో కరోనా మరణమృదంగం మోగుతూనే ఉంది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య (India's COVID19 cases) 9 లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 28,498 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 553 మందిని వైరస్ మహమ్మారి బలి తీసుకుంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  (CoronaVirus Cases In India)9,06,752కు చేరింది. కరోనా మళ్లీ మళ్లీ సోకవచ్చు.. రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకూ భారత్‌లో కరోనాతో 23,727 మంది మరణించారు. మొత్తం కేసులకుగానూ 5,71,460 మంది చికిత్స అనంతరం కోలుకోగా, ప్రస్తుతం 3,11,565 యాక్టీవ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 63.02శాతం ఉండగా, మరణాల రేటు రేటు 2.64శాతం ఉంది. AP: ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగింపు


2 వారాల్లోనే 3 లక్షల కేసులు
జులై 1 నుంచి దేశంలో ఇప్పటివరకూ 3,21,259 కోవిడ్ కేసులు (India CoronaVirus Cases) నమోదయ్యాయి. గత మూడు రోజుల్లోనూ దాదాపు లక్షవరకు కేసులు వచ్చాయి. గడిచిన 2 వారాల్లోనే 6,327 మందిని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది. 
 వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


1.20 కోట్ల శాంపిల్స్‌కు పరీక్షలు..
భారత్‌లో జులై 13 వరకు 1,20,92,503 శాంపిల్స్‌కు కోవిడ్19 టెస్టులు నిర్వహించారు. కేవలం నిన్న ఒక్కరోజే 2,86,247 శాంపిల్స్ పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) వెల్లడించింది.   RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..