కరోనాకు వ్యాక్సీన్ ( Corona vaccine )  కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ లో మునిగిన దేశాల్లో ఇండియా పై చేయి సాధించనుందా అంటే అవుననే అన్పిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. భారతదేశ తొలి వ్యాక్సీన్ ( Indias first vaccine )  కు డీసీజీఐ అనుమతి లభించడమే దీనికి ప్రధాన కారణం…


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ ..కరోనా వ్యాక్సీన్ తయారీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సంస్థతో పాటు ఇతర సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ...ఇంకా ఏ సంస్థకు డీసీజీఐ ( Drug controller and general of india ) అనుమతి మాత్రం లభించలేదు. రీసెర్చ్ చేసి కనుగొన్న వ్యాక్సీన్ లను మనుష్యులపై ప్రయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగాల్లో ఫేజ్ 1, 2, 3 దశలుంటాయి. ఇందులో భాగంగా ఇప్పుడు భారత్  బయోటెక్ సంస్థ ( Bharat biotech company ) రీసెర్చ్ చేసిన కోవ్యాక్సిన్ ( COVAXIN )  హ్యూమన్ ట్రయల్స్ ( Human trials ) ఫేజ్ 1, 2 లకు డీసీజీఐ ( DCGI ) అనుమతి ఇచ్చింది. 


Also read: దిల్లీలో మరో రెండ్రోజుల్లో ప్లాస్మా బ్యాంకు


దేశవ్యాప్తంగా ఇప్పుడీ సంస్థ తాము తయారు చేసిన వ్యాక్సీన్ ను జూలై నుంచి మనుష్యులపై ప్రయోగించనుంది. ఈ ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే కచ్చితంగా ఇది ఇండియాకు ఖ్యాతి తెచ్చిపెట్టనుంది. ఐసీఎంఆర్( ICMR ) , ఎన్ ఐ వీ ( National institute of virology )  ( NIV-PUNE )  ల సౌజన్యంతో భారత్ బయోటెక్ సంస్థ ఈ వ్యాక్సీన్ ను అభివృద్ధి చేసింది. Also read: Dexamethasone: కోవిడ్ 19 కు మరో మందు


పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి  లక్షణాల్లేని కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి సేకరించిన  SARS CoV-2 వైరస్ ను ఈ సంస్థకు అప్పగించారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఉన్న ఈ సంస్థకు చెందిన అత్యంత ఆధునిక ల్యాబ్ లో దీన్ని BSL-3 ( BIA SAFETY LEVEL-3) స్థాయిలో అభివృద్ధి చేశారు.  ఈ వ్యాక్సీన్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో అద్భుతమైన ఫలితాలు వచ్చినట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణా ఎల్లా తెలిపారు. Also read: Coronavirus vaccine: ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సీన్ అక్టోబర్‌లో మార్కెట్‌లోకి ?