ముంబై: పెట్టుబడిదారుల సొమ్మును దుర్వినియోగం చేస్తే స్టార్ట్‌ప్లకు రెండో ఛాన్స్ రావడం కష్టమని టాటా గ్రూపు గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా పేర్కొన్నారు. ముంబైలో మంగళవారం జరిగిన టైకాన్‌ వార్షిక సదస్సులో రతన్‌ టాటాతోపాటు టెక్ దిగ్గజం, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, తదితర వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. నారాయణ మూర్తి చేతుల మీదుగా రతన్ టాటా ‘లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు’ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: సివిల్స్‌లో సత్తాచాటిన బస్ కండక్టర్.. కలెక్టర్ పోస్టుకు అడుగు దూరంలో!


అవార్డు అందజేయడానికి వేదిక మీదకు వచ్చిన 73 ఏళ్ల నారాయణ మూర్తి అనూహ్యంగా 82ఏళ్ల రతన్ టాటా పాదాలను తాకి, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. రతన్ టాటాకు నారాయణ మూర్తి పాదాభివందనం చేస్తుండగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేరు గొప్పగా ఉండటం కాదు, ఆలోచనతీరు గొప్పగా ఉండాలని మూర్తి వ్యాఖ్యానించారు. మూర్తి, టాటాల ఫొటో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం టెక్ దిగ్గజం నారాయణ మూర్తిని చూసి నేర్చువాలని నెటిజన్లు స్పందిస్తున్నారు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..