సివిల్స్‌లో సత్తాచాటిన బస్ కండక్టర్.. కలెక్టర్ పోస్టుకు అడుగు దూరంలో!

BMTC bus conductor | కష్టించేతత్వం, పట్టుదల, శ్రమ ఉంటే మీరు ఏదైనా సాధించగలరని నిరూపించేందుకు ఓ బస్ కండక్టర్ అడుగు దూరంలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఇంటర్వ్యూకు హాజరుకానున్నారు.

Last Updated : Jan 29, 2020, 02:55 PM IST
సివిల్స్‌లో సత్తాచాటిన బస్ కండక్టర్.. కలెక్టర్ పోస్టుకు అడుగు దూరంలో!

బెంగళూరు: పట్టుదల, కష్టింతేతత్వం ఉంటే ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోగలమని మరోసారి రుజువైంది. గతంలో బస్ కండక్టర్ అయిన రజనీకాంత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ అయిపోయారు. ఇప్పుడు మరో కండక్టర్ తన విజయానికి మరో అడుగు దూరంలో ఉన్నారు. బీఎంటీసీ బస్ కండక్టర్ ఎన్.సి.మధు దేశంలో అత్యున్నత సర్వీసు అయిన సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ప్రతిరోజూ తన విదులు నిర్వహిస్తూనే, మరోవైపు కష్టపడి చదివారు. 29 ఏళ్ల వయసున్న మధు గత పదేళ్లుగా కండక్టర్‌గా విదులు నిర్వహిస్తున్నారు.

మధు స్వస్థలం మాండ్య జిల్లాలోని మాలవల్లి గ్రామం. కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న మధు 19ఏళ్లకే బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ (బీఎంటీసీ)లో కండక్టర్‌గా చేరారు. జాబ్ చేస్తూనే డిస్టెన్స్ విధానంలో డిగ్రీ, పీజీ పూర్తిచేశారు. అయితే తాను యూపీఎస్సీలో పాసయ్యానని తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని, కానీ వారికి అది పెద్ద సర్వీస్ పరీక్షలో కూడా తెలియదన్నారు. రోజుకు 8 గంటలు పనిచేస్తున్నా, చదువుపై ఆసక్తి తగ్గలేదు. మార్చి 25న చివరగా ఇంటర్వ్యూ ఉందని, అందుకు సిద్దమవుతున్నట్లు చెప్పారు.

Also Read: రతన్ టాటాకు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి పాదాభివందనం.. ఫొటో వైరల్

ఎథిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, సైన్స్ తాను చదివిన సబ్జెక్ట్స్ అని, ఉదయం 4 గంటలకు లేచి చదవడం మొదలుపెడతా అన్నారు. డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదవడం వల్లే మెయిన్స్ క్లియర్ చేయగలిగానని వెల్లడించారు. 2014లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు పరీక్షలో తప్పానని, దానివల్ల తాను కుంగిపోకుండా ముందుకు సాగినట్లు తెలిపారు. 2018లో సివిల్స్ రాసినా ప్రయోజనం లేకపోయిందన్నారు.

అయితే అందరిలా సివిల్స్ టాపర్ మధు ఏ కోచింగ్ తీసుకోలేదు కేవలం యూట్యూబ్ వీడియోలు చూసి క్లాసులు విన్నాడు. మెటీరియల్ కొని శ్రద్ధగా చదివారు. తాను పనిచేస్తున్న బీఎంటీసీ ఎండీ సి.శిఖా తనకు గైడెన్స్ ఇచ్చి సహకరించారు. ప్రతివారం రెండు గంటలపాటు శిక్షణ ఇచ్చేవారని, పరీక్షలు ఎలా రాయాలి, ఎలా చదవాలో అవగాహన కల్పించారని మధు వివరించారు. ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

More Stories

Trending News