Success Story, Unknown Facts About Sundar Pichai: కష్టపడితే కచ్చితంగా ఫలితం ఉంటుంది. కష్టాన్ని నమ్ముకున్నోళ్లంతా ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి చేరకుంటారు. ఇందుకు ఉదాహరణ గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ జీవితం. ఆయన ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుందర్ పిచాయ్ (Sundar Pichai) గూగుల్‌లో (Google) సీఈఓగా పని చేస్తూ ఆ కంపెనీని మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు ఆయన. ఇక సుందర్ పిచాయ్‌కి తాజాగా భారత్‌ (India) తరఫున ఎంతో ఉత్తమమైన అవార్డ్‌ వరించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం (India Government) ఆయనను వాణిజ్య, పరిశ్రమ విభాగంలో పద్మభూషణ్‌తో సత్కరించింది. 
[[{"fid":"220872","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sundar Pichai","field_file_image_title_text[und][0][value]":"Sundar Pichai"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sundar Pichai","field_file_image_title_text[und][0][value]":"Sundar Pichai"}},"link_text":false,"attributes":{"alt":"Sundar Pichai","title":"Sundar Pichai","class":"media-element file-default","data-delta":"1"}}]]


అయితే సుందర్ పిచాయ్‌ కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొనే ఇప్పుడు అంతటి ఉన్నత స్థాయికి చేరకున్నారు. 2015లో ప్రపంచంలోనే ప్రముఖ ఐటీ కంపెనీగా పేరుగాంచిన గూగుల్‌ సీఈవోగా సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) బాధ్యతలు చేపట్టారు. అలాగే గూగుల్‌లో అంత పెద్ద బాధ్యతను పొందిన భారతీయ సంతతికి చెందిన పౌరుడిగా కూడా సుందర్ పిచాయ్ ప్రత్యేకతను చాటుకున్నారు.


[[{"fid":"220873","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sundar Pichai","field_file_image_title_text[und][0][value]":"Sundar Pichai"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sundar Pichai","field_file_image_title_text[und][0][value]":"Sundar Pichai"}},"link_text":false,"attributes":{"alt":"Sundar Pichai","title":"Sundar Pichai","class":"media-element file-default","data-delta":"2"}}]]


సుందర్ పిచాయ్ అసలు పేరు సుందరరాజన్. భారత సంతతికి చెందిన ఈయన 1972లో తమిళనాడులోని మధురైలో (Madurai in Tamil Nadu) జన్మించారు. చెన్నైలో పెరిగారు. 1993లో పిచాయ్ ఐ‌ఐ‌టీ ఖరగ్‌పూర్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. అదే ఏడాదే ఆయన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సీటిలో చదువుకునేందుకు స్కాలర్‌షిప్ పొందారు. అక్కడి నుంచి ఆయన ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలాగే వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎంబీఏ కూడా పూర్తి చేశారు.
[[{"fid":"220875","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sundar Pichai","field_file_image_title_text[und][0][value]":"Sundar Pichai"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sundar Pichai","field_file_image_title_text[und][0][value]":"Sundar Pichai"}},"link_text":false,"attributes":{"alt":"Sundar Pichai","title":"Sundar Pichai","class":"media-element file-default","data-delta":"3"}}]]


సుందర్ పిచాయ్ 1995లోనే హయ్యర్ స్టడీస్‌ కోసం యూఎస్ వెళ్లారు. అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సుందర్ పిచాయ్ ప్రతి పాత వస్తువును ఉపయోగించి డబ్బు ఆదా చేసేవారు. అలాగే ఆయన చిన్నపాటి ఉద్యోగం చేసేవారు. ఇక సుందర్ పిచాయ్ ఒక కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్‌‌గా మొదట ఉద్యోగంలో చేరారు.


[[{"fid":"220876","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sundar Pichai","field_file_image_title_text[und][0][value]":"Sundar Pichai"},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sundar Pichai","field_file_image_title_text[und][0][value]":"Sundar Pichai"}},"link_text":false,"attributes":{"alt":"Sundar Pichai","title":"Sundar Pichai","class":"media-element file-default","data-delta":"4"}}]]


ఇక గూగుల్‌లో (Google) చేరడానికి ముందు సాఫ్ట్‌వేర్ కంపెనీ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలో కూడా సుందర్ పిచాయ్ పని చేశారు. అలా ఎన్నో స్ట్రగుల్స్‌ భరించి, ఏప్రిల్ 2004లో సుందర్ పిచాయ్ గూగుల్‌లో చేరారు.


[[{"fid":"220877","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sundar Pichai","field_file_image_title_text[und][0][value]":"Sundar Pichai"},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sundar Pichai","field_file_image_title_text[und][0][value]":"Sundar Pichai"}},"link_text":false,"attributes":{"alt":"Sundar Pichai","title":"Sundar Pichai","class":"media-element file-default","data-delta":"5"}}]]


మొదట ఆయన ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ బ్రాంచ్‌లో సేవలు అందించారు. గూగుల్ సెర్చ్ టూల్‌ను మెరుగుపరచడంతో పాటు ఇతర బ్రౌజర్‌ల వినియోగదారులను గూగుల్‌లోకి తీసుకురావడం వంటి బాధ్యతల్ని ఆయన సమర్థంగా నిర్వహించారు.


Also Read: Rajinikanth: తీవ్ర మ‌నోవేద‌న‌కు గురవుతున్న ర‌జ‌నీకాంత్.. కారణం ఏంటంటే?!!


సుందర్‌ పిచాయ్‌ కష్టాన్ని.. పని తీరును చూసి గూగుల్‌ కంపెనీ ఆయన్ని సీఈవోగా నియమించింది. అలాగే పిచాయ్ జులై 2017లో ఆల్ఫాబెట్ డైరెక్టర్ల బోర్డ్‌లో చేరారు. గూగుల్‌లో(Google) సుందర్‌ పిచాయ్‌ గత 15 ఏళ్లుగా సేవలు అందిస్తూనే ఉన్నారు.


Also Read: Minnal Murali Wedding Shoot: సినిమా స్టైల్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్..మామూలుగా లేదుగా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook