International flights: న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం తీసుకున్న చర్యల్లో భాగంగా 4 నెలల క్రితం అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ విమానాల రాకపోకల కోసం అమెరికా ( America ), ఫ్రాన్స్‌ ( France ) దేశాలతో తాజాగా భారత్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల నేపథ్యంలో జులై 17 నుంచి అమెరికా-భారత్ మధ్య ( India-US ), జూలై 18 నుంచి ఫ్రాన్స్- భారత్ దేశాల ( India-France ) మ‌ధ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి గురువారం మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ( Also read: Gmail new design: జీమెయిల్ ఇక ముందులా ఉండదు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా, భారత్ మధ్య జరిగిన ఒప్పందాల ప్రకారం యూఎస్‌కి చెందిన యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ జులై 17 నుంచి 31 మధ్య 18 విమానాలను నడుప‌నుంది. ఢిల్లీ- న్యూయార్క్‌ మధ్య ప్రతిరోజు ( Delhi-New york ), ఢిల్లీ- శాన్‌ఫ్రాన్సిస్కో ( Delhi to San francisco ) మధ్య వారానికి మూడు రోజులపాటు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఎయిర్‌ ఫ్రాన్స్‌ ఎయిర్ లైన్స్ సైతం జూలై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమాన స‌ర్వీసుల‌ను నడుపనుందని మంత్రి హర్దీప్‌ సింగ్ పురి తెలిపారు. ( Also read: Muhammad movie: ముహమ్మద్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రం విడుదలపై నిషేధం )


జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో ( Lufthansa airlines ) ఒప్పందం పూర్తి కావచ్చిందని.. త్వరలోనే జర్మనీ-భారత్ మధ్య సైతం విమాన సేవలు ప్రారంభం అవుతాయని మంత్రి హర్దీప్ పురి తెలిపారు. అమెరికా, ఫ్రాన్స్ తరహాలోనే త్వరలోనే బ్రిటన్‌తోనూ ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోనున్నట్టు మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. ఢిల్లీ-లండన్‌ ( Delhi to London ) మధ్య రోజుకు రెండు చొప్పున విమానాలు నడిపే విధంగా ఈ ఒప్పందం ఉండనున్నట్టు మంత్రి స్పష్టంచేశారు. రానున్న కాలంలో మరిన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకుంటామని.. కరోనావైరస్ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. ( Also read: Covid-19 Vaccine: భారత్‌కు మాత్రమే ఆ సామర్ధ్యం ఉంది )


 ( Photo gallery: ఐస్ క్రీమ్ బ్యూటీ Tejaswi Madiwada hot photos )